శ్రీకాకుళం అర్బన్: రైతుల సంక్షేమానికి తనవంతుగా కృషి చేస్తానని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన పూడి తిరుపతిరావు చెప్పారు. కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తనను నియమించినట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన 15 సంవత్సరాలుగా పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించినట్టు వివరించారు. కిసాన్‌మోర్చాలో రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేయడం జరిగిందని, ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యునిగా సేవలందిస్తున్నానన్నారు. తన సేవలను గుర్తించిన పార్టీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిందన్నారు. తనపై ఉంచిన ఈ బృహత్తర బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. కాగా తిరుపతిరావు నిమామకంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు హర్షం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమానికి కృషి
Published Thu, Jan 15 2015 4:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement