సాక్షి, తాడేపల్లి: మూడు నెలలుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చని సూచించారు. డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా స్వీయ నియంత్రణే ముఖ్యమని చెబుతున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనాపై ముందు నుంచి అప్రమత్తంగా ఉండటంవల్లే ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు విదేశాల నుంచి వచ్చినవారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని సజ్జల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment