నాందేవ్‌వాడ, న్యూస్‌లైన్ : గౌడ కులానికి చెందిన ప్రతిఒక్కరు తమ పిల్లల విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలని, ప్రతి ఒక్కరిని ఉన్నత చదువులు చదివించాలని రాష్ట్ర రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు. ఆదివారం నగరంలోని వినాయక్‌నగర్ వినాయక కల్యాణ మండపంలో పట్టణ గౌడ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రానూరాను గౌడ కులస్తులు కుల వృత్తులపై ఆధారపడి జీవించే పరిస్థితులు కనిపిం చడం లేవన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే రాష్ట్రంలో గౌడకులస్తులకు అన్నిరకాల మేలు జరుగుతుందన్నారు. సామాజిక సేవాకార్యక్రమాల్లో గౌడకులస్తులు ముందుండాలన్నారు. నగరంలో గౌడకులస్తుల కళ్యాణమండపం నిర్మాణానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో లిక్కర్ వ్యాపారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దీని వల్ల గీతకార్మికులు నష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేష్‌కుమార్‌గౌడ్‌ను పట్టణ గౌడ సంఘం టీసీఎస్ సంఘం, నగరంలోని అన్ని గౌడ కులసంఘాల సభ్యులు పూలదండలు వేసి మెమెంటోలు అందించి ఘనంగా సన్మానించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు వై.జగన్‌గౌడ్, కార్యదర్శి సత్యనారయణగౌడ్, ఎస్‌ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్యగౌడ్, రమణగౌడ్, టీసీఎస్ అధ్యక్షులు బండిసాయగౌడ్, రమేష్‌గౌడ్, చెరుకు లక్ష్మణ్‌గౌడ్, భోజగౌడ్, నేరెల్ల శ్రీనివాస్‌గౌడ్, రాజగౌడ్, ఎల్లాగౌడ్, గౌడకులస్తులు, ఉద్యోగసంఘం నాయకులు పాల్గొన్నారు.
ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి..
Published Mon, Aug 5 2013 4:54 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement