పెండింగ్ ఫైళ్లపై దృష్టి సారించండి | Focus on the pending files | Sakshi
Sakshi News home page

పెండింగ్ ఫైళ్లపై దృష్టి సారించండి

Published Fri, Jun 6 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

పెండింగ్ ఫైళ్లపై దృష్టి సారించండి

పెండింగ్ ఫైళ్లపై దృష్టి సారించండి

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పెండింగ్ ఫైళ్లపై దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్ నాయక్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం తన చాంబర్‌లో కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ కారణాలతో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలు అందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్ ఫైళ్లను సిద్ధం చేసి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదికలు అందించాలని ఆదేశించారు. మండలాల వారీగా ఏ మండలంలో ఎన్ని ఫైళ్లు ఉన్నాయి, వాటి స్థితిగతులు ఏమిటి, ఎప్పటిలోగా పరిష్కరిస్తారన్న అంశాలపై తహశీల్దార్లతో ప్రతి వారం సమీక్షించనున్నట్లు వెల్లడించారు.
 
 వరుసగా ఎన్నికలు రావడం కూడా ఫైళ్ల పెండింగ్‌పై ప్రభావం చూపిందన్నారు. మున్ముందు పెండింగ్ ఫైళ్లు.. అనేవి లేకుండా చూడాలని చెప్పారు. అందుకుగాను ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేయడం, సంబంధిత అధికారులకు పం పించడం, వాటి స్థితిగతులను తెలుసుకొని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి మిడసల జ్వాలానరసింహం పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement