మట్కా బ్రదర్స్ అరెస్టు | gambler Brothers arrested | Sakshi
Sakshi News home page

మట్కా బ్రదర్స్ అరెస్టు

Published Tue, Jan 14 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

gambler Brothers arrested

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: జ్యూవెలరీ, టైర్లు, బట్టల వ్యాపారం ముసుగులో ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ స్థాయి మట్కా రాకెట్ నిర్వహిస్తున్న అన్నదమ్ములు సయూద్ అహ్మద్, షరీఫ్ అహ ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌కు చెందిన మరో నిందితుడు గఫార్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నంద్యాల డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, టూటౌన్ సీఐ రామాంజినాయక్ ఆదివారం విలేకరులకు వెళ్లడించారు.

 కర్నూలు చిత్తారి వీధికి చెందిన వీరిద్దరు సయూద్ బ్రదర్స్ పేరిట బంగారు షాపు, టైర్లు, వీఎస్ టెక్స్‌టైల్ బట్టల షాపులు నిర్వహించారు. వీటి ముసుగులో వీరు చేస్తున్న చీకటి వ్యాపారం మట్కా. వీరు పదేళ్ల క్రితం కర్నూలులో పేరొందిన మట్కాడాన్ అసదుల్లా దగ్గర బీటర్లుగా పని చేశారు. అసదుల్లాతో విభేదాలు రావడంతో 2007లో విడిపోయి సొంతంగా కంపెనీ ప్రారంభించారు. ఆన్‌లైన్ నెట్ వర్క్ పెంచుకుని మట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు.

 అంతా ఆన్‌లైన్‌లోనే..
 మట్కాడాన్ బ్రదర్స్ హైదరాబాద్‌లోని మలక్‌పేటలో సయూద్ అండ్ బ్రదర్స్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఆఫీసు తెరిచారు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ఏర్పాటుతోపాటు వాటి నిర్వహణకు ప్రవీన్‌కుమార్‌రెడ్డి, ధరణీధర్, చిన్న, రాజును నియమించారు. ప్రాంతాల వారీగా మట్కా బీటర్లకు కోడ్ నెంబర్లు కేటాయించారు. బీటర్ల నుంచి రూ.50 వేలు మొదలు రూ.5లక్షల వరకు డిపాజిట్లు సేకరించారు. కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలతోపాటు సౌదీ, మస్కట్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నుంచి బీటర్లు ఆన్‌లైన్‌లోనే మట్కా కోడ్ అందిస్తారు.

 హైదరాబాద్ శ్రీపురం, మలక్‌పేట, సలీంనగర్ ఎస్‌బీఐ బ్రాంచ్ ఖాతాలకు  డబ్బు జమ చేస్తారు. భారీ మొత్తంలో డబ్బు వసూలైతే ముంబాయి చైతన్‌షేట్‌కు అందజేస్తారు. వీరికి ప్రతి రోజూ కనీసం రూ.10 లక్షలు తగ్గకుండా కలెక్షన్ వచ్చేది. అయితే వీరిపై నిఘా పెరగడంతో కార్యాలయాన్ని నంద్యాల సలీంనగర్‌కు మార్చారు. నిర్వహణ బాధ్యతలను ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మిత్రుడు గఫూర్ అహ ్మద్‌కు అప్పగించారు. ఈ క్రమంలో 2013 నవంబర్ 21న కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు కంప్యూటర్ ఆపరేటర్లు ధరణీధర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు చేశారు.

 బళ్లారి చౌరస్తా వద్ద అరెస్టు..
 సయూద్ అహ్మద్, షరీఫ్ అహమ్మద్   కర్నూలు బళ్లారి చౌరస్తా వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పూర్తి వివరాలు బయపడ్డాయి. వీరికి చెందిన 41బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు.  వీరిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కర్నూలుకు సంబంధించి సుదర్శన్‌గౌడ్(చున్నావాలిగల్లి), అన్వర్(నిమిషాబగుడి ఏరియా), కలీమ్, నాసీర్(గనీగల్లి ఏరియా), కరీమ్‌షేక్షా(పెద్దమార్కెట్), అన్వర్(జెమ్మిచెట్టు ఏరియా), విటల్(చిన్నమార్కెట్), అక్బర్, నిషార్‌అహ్మద్(బేకారిపేట), గని అహ్మద్(నంద్యాల), కరీమ్, పగిడ్యాలరాముడు, వహాబ్(నందికొట్కూరు), వహాబ్, శ్రీనివాసరెడ్డి(వెల్దూర్తి), మల్లికార్జున(డోన్) వీరి ఏజెంట్లుగా ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement