విశాఖ టీడీపీ అధ్యక్షుడిపై పార్టీ నేతల విమర్శ
మాడుగుల(విశాఖపట్నం): తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధ్దికి కృషి చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావును, విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావును విమర్శించే అర్హత విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు లేదని మాడుగుల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేతలు చల్లా సత్య నారాయణమూర్తి, పోతల రమణమ్మ, డెయిరీ డెరైక్టర్ సుందరపు గంగాధర్ అన్నారు. బత్తివానిపాలెంలో మంగళవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర నేతలను తూలనాడడం గవిరెడ్డి అవివేకానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. ఇటీవల విశాఖ డెయిరీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానితులుగా జిల్లా మంత్రి గంటా, బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారని వారు తెలిపారు. కానీ.. పార్టీ, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంగా పొరపాటు పడిన గవిరెడ్డి... తనను ఆహ్వానించలేదని కినుక చెందడం ఆయన రాజకీయ అవివేకతకు నిదర్శనమని వీరు పేర్కొన్నారు.
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి గవిరెడ్డి రామానాయుడు రాజీనామా చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న దాలివలస మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి రామునాయుడు, బండారు నరసింహ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకోలేని, సొంతగ్రామంలో సర్పంచ్‌గా తన బంధువును గెలిపించుకోలేని గవిరెడ్డి రామా నాయుడు నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వారు పేర్కొన్నారు. మంత్రి అయ్యన్నను చూపిస్తూ నియోజక వర్గంలో అధికారుల బదిలీల కార్యక్రమాల్లో లక్షలు దండుకున్న ఘనుడు గవిరెడ్డి అని వారన్నారు. కె.కోటపాడు మండల కార్యకర్తల నుంచి చందాలు తీసుకున్నారని ఆరోపించారు. గత స్థ్ధానిక ఎన్నికల సమయంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల టికెట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్న ‘వసూల్‌రాజా’ గవిరెడ్డి అని వారు అన్నారు. పార్టీకోసం అహర్నిశలు కృషి చేసిన సీనియర్ కార్యకర్తలను దూరంపెట్టి గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహించి తగవులు పెడుతున్న గవిరెడ్డి.. తమను వెన్నుపోటు దారులుగా అభివర్ణించడం తగదనివారు తెలిపారు.
'వారిని విమర్శించే అర్హత గవిరెడ్డికి లేదు'
Published Tue, Feb 3 2015 7:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement