gavireddy ramanaidu
-
నగర పదవి ఖరారు:జిల్లా పదవిపై ప్రతిష్టంభన
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్ పేరు దాదాపు ఖరారైంది. అయితే జిల్లా టీడీపీ అధ్యక్షుని ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గవిరెడ్డి రామానాయుడు, ఆనంద్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక తలనొప్పిగా మారిన నేపధ్యంలో నేతలు అధిష్టానానికి వదిలివేశారు. ఇదిలా ఉండగా, విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా బుడ్డా వెంకన్న ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల అర్జునుడు ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గౌతు శిరీష పేరును ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరిటాల సునీత అధిష్టానానికి సూచించారు. -
'వారిని విమర్శించే అర్హత గవిరెడ్డికి లేదు'
విశాఖ టీడీపీ అధ్యక్షుడిపై పార్టీ నేతల విమర్శ మాడుగుల(విశాఖపట్నం): తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధ్దికి కృషి చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావును, విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావును విమర్శించే అర్హత విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు లేదని మాడుగుల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేతలు చల్లా సత్య నారాయణమూర్తి, పోతల రమణమ్మ, డెయిరీ డెరైక్టర్ సుందరపు గంగాధర్ అన్నారు. బత్తివానిపాలెంలో మంగళవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర నేతలను తూలనాడడం గవిరెడ్డి అవివేకానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. ఇటీవల విశాఖ డెయిరీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానితులుగా జిల్లా మంత్రి గంటా, బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారని వారు తెలిపారు. కానీ.. పార్టీ, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంగా పొరపాటు పడిన గవిరెడ్డి... తనను ఆహ్వానించలేదని కినుక చెందడం ఆయన రాజకీయ అవివేకతకు నిదర్శనమని వీరు పేర్కొన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి గవిరెడ్డి రామానాయుడు రాజీనామా చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న దాలివలస మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి రామునాయుడు, బండారు నరసింహ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకోలేని, సొంతగ్రామంలో సర్పంచ్గా తన బంధువును గెలిపించుకోలేని గవిరెడ్డి రామా నాయుడు నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వారు పేర్కొన్నారు. మంత్రి అయ్యన్నను చూపిస్తూ నియోజక వర్గంలో అధికారుల బదిలీల కార్యక్రమాల్లో లక్షలు దండుకున్న ఘనుడు గవిరెడ్డి అని వారన్నారు. కె.కోటపాడు మండల కార్యకర్తల నుంచి చందాలు తీసుకున్నారని ఆరోపించారు. గత స్థ్ధానిక ఎన్నికల సమయంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల టికెట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్న ‘వసూల్రాజా’ గవిరెడ్డి అని వారు అన్నారు. పార్టీకోసం అహర్నిశలు కృషి చేసిన సీనియర్ కార్యకర్తలను దూరంపెట్టి గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహించి తగవులు పెడుతున్న గవిరెడ్డి.. తమను వెన్నుపోటు దారులుగా అభివర్ణించడం తగదనివారు తెలిపారు. -
ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్ను తరిమికొడతాం
టీడీపీ రూరల్ జిల్లాఅధ్యక్షుడు రామానాయుడు సాక్షి, విశాఖపట్నం: శంషాబాద్ ఎయిర్పోర్టుటెర్మినల్ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి అత్యంత హేయనీయంగా ఉందని టీడీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు అన్నారు. పార్టీ రూరల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం విశాఖపట్నంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది .ఈసమావేశానికి అధ్యక్షత వహించిన గవిరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం 1983లో సిద్దిపేట నుంచి ఓటమి చెందిన కేసీఆర్ను 1985లో మరలా సిద్దిపేట నుంచే గెలిపించి రాజకీయభవిష్యత్ను ఇచ్చిన ఎన్టీఆర్పై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్ను తెలుగువారంతా తరిమికొడతారని హెచ్చరించారు. సభ్యత్వ నమోదు లక్ష్యంలో 50 శాతం పూర్తయిందని, లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేసేందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో రాష్ర్ట పరిశీలకులు కరణం శివరామకృష్ణ, రామోహన్కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బంటుమిల్లి మణిశంకర్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్నయారాయణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, పైలా రామనాయుడు, బుద్దనాగజగదీష్, మళ్ల సురేంద్ర, దేవరపల్లి జెడ్పీటీసీ గాల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.