ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్‌ను తరిమికొడతాం | gavireddy ramanaidu takes on kcr | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్‌ను తరిమికొడతాం

Published Tue, Nov 25 2014 12:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్‌ను తరిమికొడతాం - Sakshi

ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్‌ను తరిమికొడతాం

టీడీపీ రూరల్ జిల్లాఅధ్యక్షుడు రామానాయుడు
 
సాక్షి, విశాఖపట్నం: శంషాబాద్ ఎయిర్‌పోర్టుటెర్మినల్ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి అత్యంత హేయనీయంగా ఉందని టీడీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు అన్నారు. పార్టీ రూరల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం విశాఖపట్నంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది .ఈసమావేశానికి అధ్యక్షత వహించిన గవిరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం 1983లో సిద్దిపేట నుంచి ఓటమి చెందిన కేసీఆర్‌ను 1985లో మరలా సిద్దిపేట నుంచే గెలిపించి రాజకీయభవిష్యత్‌ను ఇచ్చిన ఎన్టీఆర్‌పై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్‌ను తెలుగువారంతా తరిమికొడతారని హెచ్చరించారు. సభ్యత్వ నమోదు లక్ష్యంలో 50 శాతం పూర్తయిందని, లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేసేందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపు నిచ్చారు.  సమావేశంలో రాష్ర్ట పరిశీలకులు కరణం శివరామకృష్ణ, రామోహన్‌కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బంటుమిల్లి మణిశంకర్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్నయారాయణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, పైలా రామనాయుడు, బుద్దనాగజగదీష్, మళ్ల సురేంద్ర, దేవరపల్లి జెడ్పీటీసీ గాల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement