Shamshabad airport terminal
-
గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో కథ కంచికేనా..?
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం లండన్.. మన దేశంలోని కోల్‌కతా తరహాలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని మూడేళ్లక్రితం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్ రూట్లో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విదితమే. ఇదీ అండర్‌గ్రౌండ్ మెట్రో ప్లాన్.. రాయదుర్గం–శంషాబాద్ మార్గంలో 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయాల్సిన రూట్లో కేవలం 3 కి.మీ. మార్గంలో... శంషాబాద్ టౌన్ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్ వరకు భూగర్భ మెట్రో ఏర్పాటుచేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించింది. విమానాల ల్యాండింగ్.. టేకాఫ్‌కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించడం విశేషం. కాగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించి మూడేళ్లు గడిచినా అడుగు ముందుకుపడడంలేదు. ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా..? మొదటి దశ తరహాలో పబ్లిక్ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుందా అన్న అంశంపై సస్పెన్స్ వీడడం లేదు. (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..) ఎయిర్పోర్ట్ మెట్రో ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ వి మానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. ► కానీ మెట్రోరైళ్లలో కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను డిజైన్ చేశారు. ► ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసింది. సుమారు రూ.4500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రోకారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు అవస్థలుండవు. ► ఈరూట్లో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ► స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ► మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. స్థలపరిశీలన కూడా పూర్తైంది. (క్లిక్: అయోమయంలో ఆర్టీసీ.. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ!) -
హైదరాబాద్ నుంచి దుబాయికి విమాన సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత, యూఏఈ ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ ఒప్పందం ప్రకారం జీఎంఆర్ ఆధ్వర్యంలోని (శంషాబాద్) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఊతమివ్వనుంది. యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రతి ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో వారాని మూడు సర్వీసులను నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయికి టికెట్టును బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులందరూ కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్పోర్ట్ బబుల్స్’’ లేదా ‘‘వాయు రవాణా ఒప్పందాలు’’ అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది. దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన రెగ్యులర్ అంతర్జాతీయ సర్వీసులను పున:ప్రారంభించుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అతి తక్కువ ప్రయాణ సమయంతో, అత్యంత జాగ్రత్తల మధ్య జరిగే విమాన ప్రయాణాలే అత్యంత సురక్షితమైనవిగా తేలింది. మే 25న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేసిన కాంటాక్ట్-లెస్ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తోంది. -
ఎయిర్ పోర్ట్‌కు 25 నిమిషాల్లో జర్నీ..
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటివరకు నగరవాసుల కోసం ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాయి. ఇక కోల్‌కతా తరహా భూగర్భ మెట్రోను సైతం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్ రూట్లో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో భూగర్భ మెట్రో అంశం తెరమీదకొచ్చింది. మొత్తం 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్న ఈ రూట్లో 3 కి.మీ. మార్గంలో(శంషాబాద్ టౌన్ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్ వరకు) భూగర్భ మెట్రో ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విమానాల ల్యాండింగ్.. టేకాఫ్‌కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించినట్లు సమాచారం. కాగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4,500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా.. లేదా పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతోనా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎయిర్ పోర్ట్‌కు 25 నిమిషాల్లో జర్నీ.. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాలు పడుతుంది. కానీ మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లోనే చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను డిజైన్ చేశారు. ఈ మెట్రో కారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటిజన్లకు అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లతో విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. దీంతో తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైన విషయం విదితమే. ప్రతి ఐదు కిలోమీటర్లకో స్టేషన్.. విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ల ఏర్పాటుకు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, గండిగూడ చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో స్థలపరిశీలన జరుపుతున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్ టెస్ట్ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. పీపీపీ విధానంలో ముందుకొచ్చేనా... ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనా వేశారు. కానీ ఆస్తుల సేకరణ ఆలస్యం కావడం, అలైన్మెంట్ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యల కారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా రాయదుర్గం–శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటుకు స్పెషల్ పర్పస్ వెహికిల్ (ప్రత్యేక యంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే. -
ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్‌ను తరిమికొడతాం
టీడీపీ రూరల్ జిల్లాఅధ్యక్షుడు రామానాయుడు సాక్షి, విశాఖపట్నం: శంషాబాద్ ఎయిర్‌పోర్టుటెర్మినల్ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి అత్యంత హేయనీయంగా ఉందని టీడీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు అన్నారు. పార్టీ రూరల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం విశాఖపట్నంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది .ఈసమావేశానికి అధ్యక్షత వహించిన గవిరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం 1983లో సిద్దిపేట నుంచి ఓటమి చెందిన కేసీఆర్‌ను 1985లో మరలా సిద్దిపేట నుంచే గెలిపించి రాజకీయభవిష్యత్‌ను ఇచ్చిన ఎన్టీఆర్‌పై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జోలికొస్తే కేసీఆర్‌ను తెలుగువారంతా తరిమికొడతారని హెచ్చరించారు. సభ్యత్వ నమోదు లక్ష్యంలో 50 శాతం పూర్తయిందని, లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేసేందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో రాష్ర్ట పరిశీలకులు కరణం శివరామకృష్ణ, రామోహన్‌కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బంటుమిల్లి మణిశంకర్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏపీఎం సత్నయారాయణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, పైలా రామనాయుడు, బుద్దనాగజగదీష్, మళ్ల సురేంద్ర, దేవరపల్లి జెడ్పీటీసీ గాల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.