
కల్యాణ వెంకన్నకు బంగారు ఆభరణాలు
చంద్రగిరి: చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి గురువారం సుమారు కిలోన్నరకు పైగా బరువున్న (రూ. 42 లక్షల విలువ) బంగారు ఆభరణాలు కానుకగా అందాయి.
హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీఎస్ రాజు, సుగుణ దంపతులు గురువారం స్వామివారికి బంగారు కఠి, వరద హస్తాల ఆభరణాలను టీటీడీ జేఈవో శ్రీనివాస్‌రాజు అందజేశారు.