రోడ్డెక్కిన ఇసుక కార్మికులు | government policy of free sand | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన ఇసుక కార్మికులు

Published Thu, Mar 17 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

government policy of free sand

ఏలూరు (మెట్రో) : ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి తమ పొట్టలు కొట్టిందని ఇసుక కార్మికులు రోడ్డెక్కారు. ఎవరికి వారు ఇసుక తవ్వుకుపోతుండడంతో ర్యాంపుల్లో తమకు పనిలేక పస్తులుంటున్నామని, తమకు ఉపాధి చూపాలని నిడదవోలు మండలం విజ్జేశ్వరం, కొవ్వూరు మండలం సీతంపేట గ్రామాలకు చెందిన బోటు యజమానులు, బోటు కార్మికులు బుధవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. విజ్జేశ్వరం, సీతంపేట గ్రామాల్లో సుమారు 65 బోట్లపై 650 కుటుంబాలు ఆధారపడ్డాయని వారు పేర్కొన్నారు.
 
 గతంలో విజ్జేశ్వరం, సీతంపేట రెండు గ్రామాలకు చెందిన కార్మికులు గోంగూర తిప్ప 1, 2 ర్యాంపుల నుంచి ఇసుకను బోట్లపై విజ్జేశ్వరం లాకుల ద్వారా తాడేపల్లిగూడెం ప్రాంతాలకు రవాణా చేసి ఉపాధి పొందేవారమని చెప్పారు. ప్రస్తుతం ఉచిత ఇసుక ప్రకటించిన నేపథ్యంలో లాకుల ద్వారా ఇసుక సరఫరా చేయడం నిషేధమని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో తమ కుటుంబాలు ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తమకు ఓ దారి చూపాలని వారు కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సూరిశెట్టి ప్రభాకరరావు, వాకలపూడి వెంకటరత్నం, గొల్లకోటి నర్సయ్య, కోయి శ్రీనివాస్, సూరిశెట్టి రాఘవ, బొంబోతు సూర్యచంద్రం, పువ్వల వెంకయ్య ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement