ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
గిద్దలూరు రూరల్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగారుు. గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి నివాసంలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహ న్‌రెడ్డికి కార్యకర్తల అండదండలు ఎప్పుడూ ఉంటాయని ఆయన ప్రజల మనిషి అని అన్నారు.
సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చైర్మన్ బండారు వెంకటసుబ్బమ్మ, ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైస్ చైర్మన్ పాలుగుళ్ల శ్రీదేవి, ైవె ఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు దప్పిలి రాజేంద్రప్రసాదరెడ్డి, స్వామి రంగారెడ్డి, నాయకులు దప్పిలి కాశిరెడ్డి, పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డి కాశిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే జగన్ ధ్యేయం
ఒంగోలు అర్బన్: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని సంతనూలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ అన్నారు. గ్రామంలోని తన కార్యాలయంలో ఆదివారం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులకు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని.. దానిని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నిలదీయడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు.
అధికార పార్టీ ప్రజా సమస్యలపై చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని కాక్షించారు. కార్యక్రమంలో నాయకులు చుండూరి రవి, మండవ అప్పయ్య, మారెళ్ల బంగారుబాబు, దుంపా చెంచురెడ్డి, అప్పల కుమారస్వామి, ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ ఆశయ సాధకుడు జగన్
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధకుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ శ్రేణుల మధ్య జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను ప్రారంభించారు. బత్తుల మాట్లాడుతూ జగన్ చిన్న వయసులోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి నిరంతరం ప్రజల కోసం పోరాడటం గర్వకారణమన్నారు.
అసలైన ప్రజానాయకుడు జగన్
రాష్ట్ర ప్రజలకు అవసరమైన అసలైన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో నిందలు వేస్తున్నా నిరుత్సాహ పడకుండా ప్రజలకి మేలు చేయాలనే తపనతో పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, వాణిజ్యవిభాగం కన్వీనర్ దామరాజు క్రాంతికుమార్, నగర మహిళా విభాగం కన్వీనర్ కావూరి సుశీల, నాయకులు శింగరాజు వెంకటరావు, నరాల రమణారెడ్డి, నత్తల భీమేష్, ఆవుల జాలయ్య, డి.అంజిరెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, కె. శామ్యుల్, తోటపల్లి సోమశేఖర్, ఎస్‌వీ రమణయ్య, రామిరెడ్డి, జాజుల కృష్ణ, గంగాడ సుజాత, బడగు ఇందిర పాల్గొన్నారు.
అద్దంకిలో..
అద్దంకి: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హాజరై జన్మదిన కేక్‌ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. నిబద్ధత కలిగిన నాయకుడు జగన్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు షేక్ ఖాశిం సాహెబ్, హుస్సేన్ బాషా, స్టాలిన్ పాల్గొన్నారు.