Muttumula Ashok Reddy
-
అక్కా, తమ్ముళ్ళ మధ్య వార్.. మరోసారి పరాభవం తప్పదా?
అక్కా, తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న వార్ ఆ నియోజకవర్గంలో టీడీపీని అట్టడుగుకు నెట్టేస్తోందా? పచ్చ పార్టీలో వరుసకు అక్కా తమ్ముళ్ళయ్యే నేతల తీరుతో అక్కడి కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. కత్తులు దూసుకుంటున్న ఆ ఇద్దరి కారణంగా ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోవడం ఖాయమని డిసైడవుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ అక్కా తమ్ముడు ఎవరు? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు పిడితల సాయికల్పనారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డిల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఆగేలా కనిపించడంలేదు. 2014లో వైయస్సార్సీపి నుంచి గెలుపొంది తర్వాత టిడిపీలో చేరిన అశోక్ రెడ్దిని 2019లో గిద్దలూరు ప్రజలు భారీ తేడాతో తిరస్కరించారు. పిడితల సాయికల్పనరెడ్దికి అశోక్‌రెడ్డి వరుసకు తమ్ముడవుతారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్గా అశోక్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకి సాయి కల్పన రెడ్డి దూరంగా వుంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అశోక్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్ళడంలేదని సాయికల్పనా రెడ్డి వర్గం విమర్శిస్తోంది. దీనికి తోడు అశోక్ రెడ్డి కూడా సాయికల్పనా రెడ్డిని ఆహ్వానించడకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ఇద్దరు నేతల తీరుపై పచ్చ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల చంద్రబాబు గిద్దలూరు వచ్చిన సందర్భంలో కూడా సాయికల్పనా రెడ్డి దూరంగానే వున్నారు. చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్నా నియోజకవర్గ ఇంచార్జ్ ఆశోక్ బాబు తనను ఆహ్వానించకపోవడంతో సాయికల్పనా రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యనేతలు వెళ్ళి చంద్రబాబు సభకు హజరుకావాలని కోరినా..సాయికల్పనా రెడ్డి మాత్రం రానని తెగేసిచెప్పారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఆహ్వనం పలుకుతూ తన వర్గం కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించి వేశారు. దీంతో వీరిద్దరి వ్యవహరశైలి చంద్రబాబును సైతం అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంపైనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నుంచి సాయికల్పన లేదా ఆమె తనయుడు అభిషేక్ రెడ్డి బరిలో ఉండాలని పిడతల కుటుంబం భావిస్తోంది. తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని సాయికల్పనారెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే సాయి కల్పన ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం.. ఫోన్ ద్వారా పలకరించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం వంటి అంశాలు ఆమెకు పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయనే టాక్ నడుస్తోంది. సాయికల్పన ఇండిపెండెంట్‌గా బరిలో దిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ దెబ్బ తిని మరోసారి ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పార్టీ ప్రతిష్ట మసకబారిపోవడం, నేతల మధ్య అంతర్యుద్ధం వంటివి వైఎస్ఆర్ కాంగ్రస్ అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు. ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పీడ్ పెంచారు. సౌమ్యుడుగా పేరున్న రాంబాబు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు మీదున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకోవడం పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తూ అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
గిద్దలూరు రూరల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగారుు. గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి నివాసంలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జగన్మోహ న్‌రెడ్డికి కార్యకర్తల అండదండలు ఎప్పుడూ ఉంటాయని ఆయన ప్రజల మనిషి అని అన్నారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చైర్మన్ బండారు వెంకటసుబ్బమ్మ, ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైస్ చైర్మన్ పాలుగుళ్ల శ్రీదేవి, ైవె ఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు దప్పిలి రాజేంద్రప్రసాదరెడ్డి, స్వామి రంగారెడ్డి, నాయకులు దప్పిలి కాశిరెడ్డి, పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డి కాశిరెడ్డి పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే జగన్ ధ్యేయం ఒంగోలు అర్బన్: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని సంతనూలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ అన్నారు. గ్రామంలోని తన కార్యాలయంలో ఆదివారం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులకు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని.. దానిని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నిలదీయడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ ప్రజా సమస్యలపై చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని కాక్షించారు. కార్యక్రమంలో నాయకులు చుండూరి రవి, మండవ అప్పయ్య, మారెళ్ల బంగారుబాబు, దుంపా చెంచురెడ్డి, అప్పల కుమారస్వామి, ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ ఆశయ సాధకుడు జగన్ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధకుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ శ్రేణుల మధ్య జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను ప్రారంభించారు. బత్తుల మాట్లాడుతూ జగన్ చిన్న వయసులోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి నిరంతరం ప్రజల కోసం పోరాడటం గర్వకారణమన్నారు. అసలైన ప్రజానాయకుడు జగన్ రాష్ట్ర ప్రజలకు అవసరమైన అసలైన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో నిందలు వేస్తున్నా నిరుత్సాహ పడకుండా ప్రజలకి మేలు చేయాలనే తపనతో పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, వాణిజ్యవిభాగం కన్వీనర్ దామరాజు క్రాంతికుమార్, నగర మహిళా విభాగం కన్వీనర్ కావూరి సుశీల, నాయకులు శింగరాజు వెంకటరావు, నరాల రమణారెడ్డి, నత్తల భీమేష్, ఆవుల జాలయ్య, డి.అంజిరెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, కె. శామ్యుల్, తోటపల్లి సోమశేఖర్, ఎస్వీ రమణయ్య, రామిరెడ్డి, జాజుల కృష్ణ, గంగాడ సుజాత, బడగు ఇందిర పాల్గొన్నారు. అద్దంకిలో.. అద్దంకి: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హాజరై జన్మదిన కేక్‌ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. నిబద్ధత కలిగిన నాయకుడు జగన్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు షేక్ ఖాశిం సాహెబ్, హుస్సేన్ బాషా, స్టాలిన్ పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. హామీ నెరవేర్చు
కొమరోలు : రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేసి చంద్ర బాబు వారికిచ్చిన హామీ నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని రాజుపాలెం పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రైతు సాధికార సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేసి తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాలని ముత్తుముల కోరారు. ప్రస్తుతం రూ.50 వేలు మాఫీ చేస్తున్నారని, దాని వడ్డీ కూడా మాఫీ చేస్తున్నారో లేదో చెప్పాలన్నారు. అదే విధంగా రూ.50 వేలు పైన రుణం తీసుకున్న రైతులకు ఐదు విడతలుగా మాఫీ చేస్తామంటున్నారని, అప్పటి వరకూ కొత్త రుణాలు, వడ్డీ పరిస్థితి ఏంటో రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. రుణ మాఫీపై అధికారులు, రైతులు, బ్యాంకు అధికారులు గందరగోళంలో ఉన్నారని, వారి సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో పండించిన సుమారు 50 టన్నుల శనగలు గోడౌన్లలో నిల్వలు ఉన్నాయని, వీటిని రైతుల నుంచి క్వింటా రూ.5 వేలకు కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మేలుచేయాలన్నారు. డ్వాక్రా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మహిళలపై వడ్డీభారం మోపుతున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి తక్షణమే సమాధానం చెప్పాలని అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావు, కొమరోలు, గిద్దలూరు ఎంపీపీలు కామూరి అమూల్య, కడప వంశీధర్‌రెడ్డి, ఎంపీడీఓ దేవడ్ల నర్సయ్య, ఎంపీటీసీ సభ్యురాలు గోడి లక్షమ్మ, ఎంఈఓ బొర్రా వెంకటరత్నం, వ్యవసాయాధికారి జక్కం మెర్సీ పాల్గొన్నారు. -
నేడు జగన్ రాక
గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణ భారీ ఏర్పాట్లు చేసిన నాయకులు యద్దనపూడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం యద్దనపూడి రానున్నారు. యద్దనపూడి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం యద్దనపూడిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆయన యద్దనపూడి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి హాజరు కానున్నారు. ఈ సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ బుధవారం పరిశీలించారు. ఈ సభకు అద్దంకి, పర్చూరు, చిలకలూరిపేట నియోజకవర్గాలనుంచి గొట్టిపాటి నరసయ్య అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరానున్నారు. విగ్రహావిష్కరణకు వచ్చే వాహనాలు గన్నవరం రోడ్డులో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మార్టూరు, చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు యద్దనపూడి పెట్రోలు బంకు వద్ద నిలిపే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం యద్దనపూడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు.. 25 వేల మందికి అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, పోతుల రామారావుతోపాటు జిల్లా నాయకులు పలువురు పాల్గొంటున్నారు. వీరితోపాటు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, పార్టీ నేతలు నందమూరి లక్ష్మీపార్వతి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర జిల్లాల నుంచి పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి పాల్గొనే ఈ బహిరంగ సభకు అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ పిలుపునిచ్చారు. -
మోసపు బాబును ఎండగడదాం
చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, డ్వాక్రా మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాట్లాడారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే... మాయమాటలు చెబితే ప్రకృతి కూడా సహకరించదు గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే ప్రజలకు మంచి చేద్దామని మంచి మనసుతో అధికారంలోకి వస్తే అదే తరహాలో వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అలా కాకుండా మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించేలా అధికారంలోకి వచ్చినందు వల్లనే వాతావరణం కూడా అనుకూలించలేదు. అందుకే వర్షాలు లేవు, సాగు నీటి కాలువల్లో నీరు లేదు, విత్తనాలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి 2004 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అధికారంలోకి రాగానే అమలు చేశారు. అయితే 2014 ఎన్నికల్లో హామీలిచ్చిన చంద్రబాబునాయుడు వాటన్నింటి నీ గాలికొదిలేశాడు. మాటలు కోటలు దాటాయి.. చేతలు లేవు పాలపర్తి డేవిడ్ రాజు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటాయి. పెద్ద ఎకనమిస్ట్నని, ఆర్థిక రంగంలో మంచి ప్రావీణ్యం ఉందని, పాలన ఎలా చేయాలో తనకు బాగా తెలుసునని ఊదరగొట్టాడు. చంద్రబాబు చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకోవాల్సింది పోయి ప్రజలను ఏ విధంగా మోసపు మాటలు చెప్పి మాయచేయచ్చో తెలుసుకున్నారు. కేవలం ఆ కుర్చీమీద ప్రేమతోటే ప్రజలకు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం మొదలుకొని వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో పోరు బాటలోనే నడిచింది. రైతుల పక్షాన పోరాటం పోతుల రామారావు, కందుకూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపించేలా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. తనకున్న అనుభవం రాష్ట్రంలోనే ఎవరికీ లేదంటూ ప్రజలను వంచించిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పటికైనా ఆయన నిజాల్ని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే ప్రజల ఆగ్రహం కొంతలో కొంతైనా తగ్గుతుంది. రుణాలు మొత్తం లక్షా ఇరవై వేల కోట్లకి పైగా ఉంటే రూ.5 వేల కోట్లు రైతుల రుణాలకి కేటాయించానని చెప్పి తిరిగి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాలు చేపడుతున్నారని తెలియడంతో ఏవో మాయ లెక్కలు చెప్తూ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నాడు. రాజధాని పేరుతో 60 నుంచి 70 వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని రైతుల వద్ద నుంచి బలవంతంగా పంటపొలాల్ని లాక్కోవాలని చూడటం సహించరానిది. ఓడిపోయిన వారితో కమిటీలా? ఆదిమూలపు సురేష్, సంతనూతపాడు ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలు, నాయకులను సమాజసేవ చేసే సామాజిక కార్యకర్తలుగా అభివర్ణించి మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల్లో వారిని వేసి గ్రామాల్లో ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. ఎంపీటీ పీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసి ప్రజల చేత ఛీ కొట్టించుకొని ఓడిపోయినవారిని కమిటీలో వేయడం ద్వారా ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయలేదని సామాజిక కార్యకర్తల ముసుగులో ఉన్న టీడీ పీ నాయకులు పింఛన్లు, రేషన్ కార్డులు ఇలా అనేక సంక్షేమ పథకాల నుంచి వాళ్ల పేర్లు పీకేయిస్తున్నారు. ఫించన్ల సొమ్ము పెంచుతామని ప్రకటించి 10 లక్షల ఫించన్లు తీసేశారు. 20 లక్షల రేషన్ కార్డులు పీకేశారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమైన చంద్రబాబు విదేశీ పెట్టుబడిదారులను ఏవిధంగా నమ్మిస్తారో ఎవరికీ అంతుబడట్టడం లేదు. ఆరు నెలల్లోనే నిజస్వరూపం బయటపడింది జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే మాట చెప్పి.. తప్పిన మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన చెప్పేదొకటి చేసేది మరొకటి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది. చెప్పింది చెప్పినట్లు చేయాలంటే ఒక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి మాత్రమే చెల్లింది. రాజన్నను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 5 హామీలిచ్చి ప్రజలకు ఉరి బిగిస్తున్నాడు. రైతు రుణమాఫీలు, డ్వాక్రా మహిళల రుణమాఫీల విషయంలో చంద్రబాబు చేతులెత్తేసినట్లే. ఇంటికొక ఉద్యోగం.. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల చిట్టా విప్పితే చాంతాడంత ఉంటుంది. ఎన్నికల హామీల విషయాన్ని విస్మరించి ఆయన పార్టీ కార్యకర్తలకి మాత్రం సోషల్ వర్కర్లు అని ముద్రవేసి దోచిపెట్టేందుకు పథకం వేశారు. చంద్రబాబుది నీచపాలన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే చంద్రబాబుది నీచపాలన. వైఎస్ పాలన సువర్ణయుగం. చంద్రబాబు నాయడు నరకాసురుడు లాంటి లక్షణాలు కలవాడు. నాయకుడంటే ఎలా ఉండకూడదో ఆయన్ను చూసి నేర్చుకుంటే సరిపోతుంది. ఎన్నికల సమయంలో అందరికీ బంగారు పాలన ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడేమో నీచంగా పాలిస్తున్నాడు. రైతుల రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి మరి ఇప్పుడు రూ.40 వేల కోట్లు ఇస్తానంటున్నాడు. రైతులు, మహిళలు ఇలా..అన్నీ సమాజిక వర్గాల కోసం పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడిని ఎండకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రుణాలు రద్దు చేసే వరకూ పోరాటం వరికూటి అశోక్ కుమార్, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు రద్దయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. టీడీపీ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దోచిపెట్టాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచనే ఎక్కడా కనపడటం లేదు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇకపై కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటారు. మనందరం ఆయనకు అండదండగా ఉండాలి. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి గొట్టిపాటి భరత్, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఓట్లకోసం, సీట్ల కోసం మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి. అధికారం కోసం నోటికొచ్చిన మాటల్లా చెప్పి ప్రజలను అంధకారంలోకి నెట్టాడు. ఎన్నికలకు ముందు రుణమాఫీపై ఒకరకంగా చెప్పి అధికారం చేతికొచ్చిన తర్వాత మరొక రకంగా చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపై పెడతానని చివరకు రుణమాఫీ చెయ్యడానికి సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు కోటయ్య కమిటీని వేస్తూ సంతకం పెట్టడం అత్యంత దారుణం. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఇచ్చిన ఎన్నికల హామీని అధికారంలోకి రాగానే అమలు చేసి చూపించిన నేతగా ఆయన చరిత్రలోకి ఎక్కారు. చంద్రబాబు కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనే లేదు. దేశం నేతలు పండుగ చేసుకుంటున్నారు బుర్రా మధుసూధన్ యాదవ్, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి కనిగిరిలో టీడీపీ నాయకులు గురువారం బాణసంచా కాల్చారు. ఎందుకు కాలుస్తున్నారు, ఏంటి అని స్థానిక ప్రజలు వాళ్లని అడిగితే నాలుగు రోజుల్లో చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నాడని ఆకాశ సువ్వలు కాలుస్తున్నామని చెప్పారు. అంటే రైతుల పట్ల ప్రజల పట్ల టీడీపి నాయకులకు ఎంత చిన్నచూపు ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒకపక్క రైతులు, డ్వాక్రా మహిళలు నానా అవస్థలు పడుతూ కుటుంబాలు గుల్ల చేసుకుంటుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రం పండగలా ఉన్నట్టుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు. ఈరోజుకు ఈ రోజు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగిస్తుంది. వెనుకా ముందు చూడకుండా అబద్ధాలు వరికూటి అమృతపాణి, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు వ్యతిరేకంగా తన పాలన సాగిస్తున్నాడు. తనకు అనుభవం ఉందని, తనవద్ద చాలా విద్యలున్నాయని ఆయన ఎన్నికల కమిషన్‌కి కూడా లేఖ రాశారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకైనా రుణమాఫీ జరిగిందా? సిగ్గు శరం లేకుండా, వెనకాముందు చూడకుండా అబద్ధాలాడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేకి చంద్రబాబు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎవరైనా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ైవె ఎస్ రాజశేఖరరెడ్డి తర్వాతే. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిరుద్యోగ భృతి కావాలని అడిగితే అలాంటి హామీలు నేనెప్పుడిచ్చానని ఎదురు ప్రశ్న వేయడం చంద్రబాబుకే దక్కింది. -
వైఎస్సార్ సీపీ ధర్నాను జయప్రదం చేయండి
గిద్దలూరు: రైతులు, మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 5న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక తన నివాస గృహంలో ఆయన ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా పోరాడతామన్నారు. బూటకపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రైతులను, మహిళలను, నిరుద్యోగులను, విద్యార్థులను నిలువునా మోసగించిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాల్ని చూస్తూ ఊరుకోబోమని..వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఆచరణ సాధ్యంకాని 200 హామీలను గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయని..కనీసం వడ్డీ మాఫీ పథకం అమలయ్యే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇప్పిస్తానని, లేదంటే నిరుద్యోగభృతి చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు వారి ఆశలు అడియాశలు చేశారన్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రూ.102 లక్షల కోట్లు ఉన్నాయని, సంవత్సరానికి వడ్డీ రూ.14 లక్షలు వస్తుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. పింఛను అర్హత పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీలో కనీసం ప్రజాప్రతినిధులు కానివారిని నియమించారని, తద్వారా పచ్చచొక్కా వారికి పెత్తనం కట్టి అర్హులైన వారి పింఛన్లు తొలగించేలా చేశారన్నారు. టీడీపీ నియంతృత్వ పాలన ఎక్కువ కాలం మనలేదని, ప్రజాగ్రహానికి గురై కొట్టుకుపోక తప్పదన్నారు. 5వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతుందన్నారు. ధర్నాలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్సీపీ మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు కే.హిమశేఖరరెడ్డి, మోపూరి బ్రహ్మం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దుగ్గా రామ్మోహన్‌రెడ్డి, నాయకులు షేక్ పెద్దభాషా, బిజ్జం వెంకటరామిరెడ్డి, గులాం చిన్నవీరయ్య, రాజశేఖర్, ఎన్.వి.సుబ్బారెడ్డి, సూరా పాండురంగారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
ఇక దద్దవాడకు మహర్దశ
గిద్దలూరు: వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉన్న దద్దవాడ పంచాయతీని సంసాద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నుకోవడంతో ఆ గ్రామానికి మహర్దశ పట్టనుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాసంలో దద్దవాడ గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఐదేళ్ల కాలంలో మూడు గ్రామాలను ఎన్నుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. అందులో దద్దవాడను చేర్చాలని కోరిన వెంటనే ఎంపీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. గిద్దలూరు ప్రాంతంలో జవాన్లు అధికంగా ఉన్నారని సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని కోరగానే ఎంపీ రక్షణశాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు చేశారన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డికి నియోజకవర్గ ప్రజలు, దద్దవాడ ప్రజల తర ఫున కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వ తీరు దారుణం: ఎన్నికల సమయంలో అధి కారం కోసం టీడీపీ వ్యవసాయ రుణాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రూ.87 వేల కోట్లుఉన్న రుణాలను రూ.5 వేల కోట్లకు తగ్గించేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు ఒక్క అక్షరం తప్పు ఉన్నా రుణమాఫీ చేయకుండా కొర్రీ వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రైతులను అబద్ధపు హామీలతో మోసగించేకన్నా...తన కు చేతకాదని చెప్పి వారికి క్షమాపణ చెప్పవచ్చుకదా అని ఎద్దేవా చేశారు. వేలాది మంది లబ్ధిదారులను విచారించేందుకు, వారి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు తీసుకునేందుకు రెండు రోజుల సమయం ఇస్తే వారు ఎలా సర్వే నిర్వహిస్తారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఈసర్వే పూర్తి చేసి 15వ తేదీలోగా బ్యాంకులో అప్లోడ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితిని గమనించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యంకాదని హామీ ఇవ్వలేదని, హామీలు ఇచ్చి రైతులను మోసం చేయడం ఇష్టం లేకనే చెప్పలేదన్నారు. టీడీపీ మోసపూరిత హామీలు ఇచ్చి కమిటీలు, సాధికార సంస్థల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బూటకపు రుణమాఫీ హామీ వలన రైతులు తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు చెల్లించాల్సి పరిస్థితి నెలకొందన్నారు. రుణాలు చెల్లించకపోవడంతో పంటల బీమా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆయన వెంట దద్దవాడ సర్పంచి గులాం చిన్నవీరయ్య, ఉపసర్పంచి బిజ్జం వెంకటరెడ్డి, కొమరోలు వైస్ ఎంపీపీ బి.చిన్నఆంజనేయులు, మాజీ సర్పంచి బిజ్జం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, నాయకులు రోశిరెడ్డి, నారు వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, కైపా కోటేశ్వరరెడ్డి ఉన్నారు. -
పార్టీని బలోపేతం చేస్తా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, పార్టీని బలోపేతం చేస్తా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఇతర సహచర ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 5వ తేదీన జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తహ శీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను పూర్తి స్థాయిలో ఎండగడతామని చెప్పారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దాడుల్ని అందరి సహకారంతో ఎదుర్కొంటానన్నారు. పార్టీ కార్యకర్తలకు పూర్తి అండదండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. బయోడేటా.. పేరు ముత్తుముల అశోక్‌రెడ్డి పుట్టిన తేదీ:15-07-1968 తల్లితండ్రులు:రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవమ్మ స్వస్థలం: కొమరోలు విద్యార్హత: (బీటెక్) పదవి: గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత నివాసం: ప్రశాంతినగర్, గిద్దలూరు కుటుంబం: భార్య-పుష్పలీల, పిల్లలు - దివ్యేష్, భవజ్ఞ సేవా కార్యక్రమాలు: తల్లిదండ్రుల పేరుతో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం రాజకీయ నేపథ్యం: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు ఆకర్షితులై వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో 2010లో పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. ఆయన సేవలను గుర్తించి 2013లో పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో పది సొసైటీల్లో ఎనిమిది సొసైటీలు, 60 శాతం సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందారు.