నేడు జగన్ రాక | ys jagan mohan reddy comes to district | Sakshi
Sakshi News home page

నేడు జగన్ రాక

Published Thu, Dec 11 2014 2:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

నేడు జగన్ రాక - Sakshi

నేడు జగన్ రాక

గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణ
భారీ ఏర్పాట్లు చేసిన నాయకులు


యద్దనపూడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గురువారం యద్దనపూడి రానున్నారు. యద్దనపూడి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం యద్దనపూడిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆయన యద్దనపూడి చేరుకుంటారు.  ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి హాజరు కానున్నారు.  ఈ సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ బుధవారం పరిశీలించారు.

ఈ సభకు అద్దంకి, పర్చూరు, చిలకలూరిపేట నియోజకవర్గాలనుంచి గొట్టిపాటి నరసయ్య అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరానున్నారు. విగ్రహావిష్కరణకు వచ్చే వాహనాలు గన్నవరం రోడ్డులో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మార్టూరు, చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు యద్దనపూడి పెట్రోలు బంకు వద్ద నిలిపే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం యద్దనపూడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు.. 25 వేల మందికి అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, పోతుల రామారావుతోపాటు జిల్లా నాయకులు పలువురు పాల్గొంటున్నారు. వీరితోపాటు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, పార్టీ నేతలు నందమూరి లక్ష్మీపార్వతి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర జిల్లాల నుంచి పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.  పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహనరెడ్డి పాల్గొనే ఈ బహిరంగ సభకు అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement