
మాస్ కాపీయింగ్‌కు అవకాశం
గ్రూప్–2 లో గ్రూపు దరఖాస్తులపై అభ్యర్థుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 26న నిర్వహించతలపెట్టిన గ్రూప్2 ప్రిలిమ్స్ పరీక్ష మాస్ కాపీయింగ్‌కు వీలు కల్పించేలా ఉందని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌టిక్కెట్ల జారీలో కొన్ని తప్పులు నెలకొనగా.. కొన్ని కోచింగ్ సెంటర్లు, ఇతర సంస్థల్లో తర్ఫీదు పొందుతున్నవారిలో అనేకమందికి పక్కపక్క హాల్‌టిక్కెట్ల నెంబర్లు వచ్చాయని తాజాగా వెల్లడైంది. దీంతో ఇతర అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షను ఒకవారం వాయిదా వేసి అభ్యర్థులకు హాల్‌టిక్కెట్ నెంబర్ల వరుసక్రమాన్ని మార్పు చేయాలని కోరుతున్నారు.
పరీక్ష వాయిదా వేయలేం: ఛైర్మన్
దీనిపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్‌ను వివరణ కోరగా... సెకనుకు మూడు దరభాస్తులు మాత్రమే అప్‌లోడ్ అవుతాయని, భారీగా ఒకేసారి దరఖాస్తు చేయడానికి వీలుకాదని చెప్పా రు. ఇలాంటి అభ్యర్థులున్న చోట్ల తాము కాపీయింగ్‌కు తావులేకుండా ప్రత్యేక చర్య లు చేపడతామని చెప్పారు. పరీక్ష వాయిదా కానీ సాధ్యంకాదని స్పష్టంచేశారు.