ఆ గ్రామంలో తొలి సంతానానికి ఒకటే పేరు | Jogimpeta Village is the Same Name for the First Child | Sakshi
Sakshi News home page

ఆ గ్రామంలో తొలి సంతానానికి ఒకటే పేరు

Published Sun, Nov 10 2019 9:20 AM | Last Updated on Sun, Nov 10 2019 9:20 AM

Jogimpeta Village is the Same Name for the First Child - Sakshi

జోగింపేట గ్రామం

సీతానగరం : ఒక్కో ఊరిది ఒక్కో ప్రత్యేకత. అక్కడి ఆచార వ్యవహారాలూ ఆసక్తికరమే. కొన్ని ఆనవాయితీలూ ఆశ్చర్యకరమే. సాధారణంగా ఏ ఊరికైనా ఓ పేరుంటుంది. కానీ ఆ ఊరిపేరే అక్కడ పుట్టిన తొలిసంతానానికి పెట్టుకోవడం విచిత్ర ఆనవాయితీ. ఇదీ సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామం ప్రత్యేకత. జోగింపేటలో 250 కుటుంబాలున్నాయి. ఆ గ్రామస్తుల ఇలవేల్పు సుబ్బమ్మ పేరంటాలు. ఈ అమ్మవారిని  గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా గ్రామానికి చేరుకుని  పూజించడం పరిపాటి. శతాబ్దాల కాలంగా జోగింపేటలో ఏ కుటుంబంలోనైనా తొలి సంతానానికి మాత్రం ఆ ఊరి పేరే పెడతారు. సాధారణంగా నామకరణం నక్షత్రాలను బట్టి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈ విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. జోగింపేటలో అమ్మాయి పుడితే సుబ్బమ్మ, అబ్బాయి పుడితే గోపాలరావు, సుబ్బినాయుడు పేరే పెడతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement