ఎవరెస్టు శిఖరంపై విజయబావుటా ఎగరేసేందుకు ఓ తెలుగు యువకుడు నడుం కట్టాడు. కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన తిమ్మినేని భరత్.. కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో ఈ నెల 9నుంచి సాహసయాత్ర చేపట్టనున్నాడు. బుధవారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన యాత్ర వివరాల్ని తెలిపాడు.
ఇప్పటికే ఎన్నో పర్వతాల్ని ఎక్కిన తనకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు చైనా ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు లభించాయని, యాత్రకు అయ్యే రూ.25 లక్షలను అభయ ఫౌండేషన్, మైత్రీ మూవీ మేకర్స్, సోదరి బిందు తమ్మినేని భరిస్తున్నరని చెప్పారు. ఈనెల 6న కర్నూలులో బయల్దేరి, 9న చైనా నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇందుకుగాను 50 నుంచి 55 రోజులు పడుతుంది. భరత్ తోపాటు కొందరు అమెరికన్లు కూడా ఎవరెస్టు అధిరోహణకు బయలుదేరనున్నారు.