ఒక నిమిషంలో 37 జోకులు! | korukonda ranga rao record | Sakshi
Sakshi News home page

ఒక నిమిషంలో 37 జోకులు!

Published Mon, Feb 2 2015 7:17 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

ఒక నిమిషంలో 37 జోకులు!

ఒక నిమిషంలో 37 జోకులు!

విశాఖపట్నం: ఒక్క నిమిషంలో 37 జోకులు... 10 గంటలు ఏకధాటిగా 40 వైవిధ్య పాత్రాభినయాలు ఆహుతులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. లాఫర్స్ ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వైశాఖి జల ఉద్యానవనంలోని ఎస్‌ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్ ఆదివారం ఈ  కార్యక్రమానికి వేదికైంది. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ రంగారావు లిమ్కా రికార్డు కోసం ఒక నిమిషం నిడివిలో అత్యధిక జోకులు చెప్పి నవ్వులు పూయించారు.

ఏ వర్గాన్నీ నొప్పించని, క్లుప్తమైన కొంటె ప్రశ్న, చిలిపి సమాధానం తరహాలో బుల్లెట్ ట్రైన్ వేగంతో ఒక నిమిషం జోకుల పర్వం దూసుకెళ్లింది. ఉదయం 9.52 గంటల నుంచి 9.53 వరకు 37 జోకులతో నవ్వులు కురిపించారు. ఆ వెంటనే 10 గంటలు ఏకబిగిన సుమారు 40 వైవిధ్యమైన పాత్రలను అభినయిస్తూ రంగారావు చేసిన నవ రసావిష్కారం ఆబాలగోపాలాన్నీ కట్టిపడేసింది.

సిరి షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఏయూ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్ రాజు, రంగస్థల, సినీ రచయిత, నటుడు కాశీవిశ్వనాథ్, స్టీల్ ప్లాంట్ జీఎం (మెయింటెనెన్స్) ఓఆర్ రమణి, డీజీఎం(ఐసీ) ఎస్‌ఎస్‌టీ సామీ తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

Advertisement
Advertisement