నకిరేకల్(గుంటూరు): గుంటూర్ బ్రాంచీ కెనాల్‌లో పడి వ్యక్తి గల్లంతయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం కండగట్ల గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. కండగట్ల గ్రామానికి చెందిన చవల వెంకట సుబ్బయ్య(40) నీరు తాగేందుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో దిగారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పమాదవశాత్తు ఆయన కాలువలో పడి గల్లంతయ్యారు. విషయం తెలిసిన బ్రాంచ్ కెనాల్ అధికారులు నీటి మట్టాన్ని తగ్గించారు. కాగా, ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.