
సాక్షి, తూర్పు గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలతో పార్లమెంట్‌లో ముందుకు సాగుతామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల గురించి బడ్జెట్ చర్చలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. ఎయిమ్స్, మెట్రోలకు సంబంధించి కేంద్రం బడ్జెట్‌లో ఎంత కేటాయించిందో స్పష్టం చేయలేదని భరత్ వెల్లడించారు.
కేంద్రం చేపట్టిన 'క్లీన్ గంగా మిషన్' తరహాలో ఇక్కడ కూడా క్లీన్ గోదావరి మిషన్‌ను ప్రారంభిస్తామని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాజమండ్రిలోని వాస్ చెరువు నుంచి వేమగిరి వరకు అతిపెద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరలో రాజమండ్రిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని భరత్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment