
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్‌కు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రూపకల్పన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అతితక్కువ ఖర్చుతో టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. సోలార్ రూఫ్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్ తో రూపొందించిన మోడల్ హౌస్‌ను 48 గంటల్లో పూర్తి చేశారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో మొదటిసారిగా ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ ఇంటి నిర్మాణానికి సుమారు మూడున్నర లక్షల లోపు ఖర్చువుతుందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment