Model House
-
మోడల్ హౌస్ ను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
మోడల్ గృహాన్ని పరిశీలించిన సీఎం
సాక్షి, అమరావతి: పేదల సొంత ఇంటి కల నెరవేర్చడంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం బోటు యార్డు వద్ద గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన మోడల్ గృహాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం పరిశీలించారు. హాలు, బాత్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్, ఫ్లోరింగ్, బయట వరండాను, మెటీరియల్ నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి వినియోగించిన మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. – అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు పక్కా ఇంటిని నాణ్యతతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. – 17,000 వైఎస్సార్ జగనన్న కాలనీలలో పక్కా ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతలో 15 లక్షలు, రెండో విడతలో మరో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఇళ్లు మోడల్ హౌస్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి మోడల్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారని, రాష్ట్రంలో ఇదే తరహాలో పేదల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి ఉన్నట్లేనని అన్నారు. -
మోడల్ హౌస్‌ను పరిశీలించిన సీఎం జగన్
-
మోడల్ హౌస్‌ను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
మోడల్ హౌస్‌ను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన మోడల్ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పరిశీలించారు. తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్ హౌస్‌ను నిర్మించింది. సెంటు స్థలంలో తక్కువ ఖర్చుతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సౌకర్యవంతంగా నిర్మాణం చేసింది. 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్రూమ్, కిచెన్, వరండాలతో కూడిన ఈ నిర్మాణానికి 2లక్షల 50వేల రూపాయలు ఖర్చు అయింది. అత్యంత తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. -
48 గంటల్లో మోడల్ హౌస్
-
ఏపీలో తొలిసారిగా.. 48 గంటల్లో మోడల్ హౌస్
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్‌కు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రూపకల్పన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అతితక్కువ ఖర్చుతో టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. సోలార్ రూఫ్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్ తో రూపొందించిన మోడల్ హౌస్‌ను 48 గంటల్లో పూర్తి చేశారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో మొదటిసారిగా ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ ఇంటి నిర్మాణానికి సుమారు మూడున్నర లక్షల లోపు ఖర్చువుతుందని ఆయన వివరించారు. -
మన దేశంలో 3డీ ఇళ్లు!
చెన్నై: మరో ఏడాదిలో దేశంలో 3డీ ప్రింటెడ్ ఇళ్లు దర్శనం ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించి ఐఐటీ మద్రాస్‌కు చెందిన పూర్వ విద్యార్థులు (త్వస్త మ్యాన్‌ఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ స్టార్టప్) కేవలం రెండు రోజుల్లోనే దేశీ టెక్నాలజీతో విజయంతంగా 3డీ ప్రింటెడ్ ఇల్లును నిర్మించారు. ఐఐటీఎమ్ క్యాంపస్‌లోనే నిర్మించిన ఈ నమునాను ఏడాదిలోగా పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకురానున్నట్లు త్వస్త సహా వ్యవస్థాపకుడు ఆదిత్య వీఎస్ తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయల కొరత, తలదాచుకోవడానికి ఇళ్లు కూడా లేనివారే ఈ నిర్మాణాలకు ప్రేరణ అని పేర్కొన్నారు. స్వచ్ఛ్భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అందరికీ ఇళ్లు)పథకాలను 3డీ ప్రింటింగ్‌తో సాకారం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ప్రమాణాలతో కూడిన ఇళ్లను నిర్మించడానికి పలు పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలసి పనిచేస్తున్నట్లు ఐఐటీ మద్రాస్‌లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కొషి వర్ఘేస్ వెల్లడించారు. ఈ నిర్మాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్‌ను వాడుతున్నామని, మరోవైపు సహజమైన పదార్థాలతో సిమెంట్ తయారు చేయడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నమునా ఇంటి నిర్మాణానికి రెండు రోజులు పట్టినా 320 చదరపు అడుగుల ఇంటిని అన్ని హంగులతో వారం రోజుల్లో పూర్తి చేయగలమని త్వస్త వ్యవస్థాపకులు పరివర్తన్‌రెడ్డి, విద్యాశంకర్, సంతోష్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
మోడల్ హౌజ్ ప్రారంభమెప్పుడో ?
బేల: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రక్కన 2013 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించిన మోడల్ హౌజ్ నేటికి ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాదాపు భవనం పనులు పూర్తి అయినప్పటికి అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది. ఈ భవనానికి తలుపులు, కిటికిలు బిగింపు సైతం పూర్తి అయింది. కేవలం వైట్‌వాష్ వేసేస్తే మోడల్ హౌజ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికి, దీన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. 2013సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.2.50 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌజ్ నిర్మించడానికి నిధులు విడుదల చేసింది. మండల కేంద్రంలో ఇలా ఏర్పాటు చేసిన మోడల్ హౌజ్ నమూనాతో మండల వాసులు ఇందిరమ్మ గృహలను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా కొద్దిపాటి పనులతో ఈ మోడల్ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఈ అసంపూర్తి భవన నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తే మండల కేంద్రంలో పనిచేసే సంబంధిత అధికారులకు మరో నూతన కార్యాలయం అందుబాటులోకి వస్తుందని మండలవాసులు అంటున్నారు.