
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన మోడల్ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్ హౌస్‌ను నిర్మించింది. సెంటు స్థలంలో తక్కువ ఖర్చుతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సౌకర్యవంతంగా నిర్మాణం చేసింది. 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, వరండాలతో కూడిన ఈ నిర్మాణానికి 2లక్షల 50వేల రూపాయలు ఖర్చు అయింది. అత్యంత తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment