జాతర.. అధరహో... | medaram jathara celebrations | Sakshi

జాతర.. అధరహో...

Feb 12 2014 2:42 AM | Updated on Sep 2 2017 3:35 AM

వరంగల్‌కు చెందిన శ్రీను, భోజారావు ఇద్దరు మంచి మిత్రు లు. అమ్మల మొక్కులకు మంగళవారం మేడారం వచ్చిండ్రు. తనివితీరా మొక్కుకున్నరు. తర్వాత జాతరంటే మజానే కదా అని సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లిండ్రు.

 వరంగల్‌కు చెందిన శ్రీను, భోజారావు ఇద్దరు మంచి మిత్రు లు. అమ్మల మొక్కులకు మంగళవారం మేడారం వచ్చిండ్రు. తనివితీరా మొక్కుకున్నరు. తర్వాత జాతరంటే మజానే కదా అని  సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లిండ్రు. ఎప్పడెప్పుడా అనే తొందరలో ఉన్న భోజారావు.. అన్నా రెండు నాకౌట్ బీర్లు ఇయ్యే అన్నడు. యజమాని రమేష్ బీర్లు తెచ్చి ముందటపెట్టిండు. శ్రీను మరో ఆర్డ ర్ వేసిండు. దుకునం అన్నా.. నంజుకోడానికి ప్లేట్ చికెన్ తేరాదే అన్నడు. అన్న మరుక్షణమే చికెన్ ముందుకు వచ్చింది. ఒకటి.. రెండు పోయి ఏకంగా తలా మూడు బీర్లు లాగించిండ్రు. ఫుల్ జోష్‌మీద దుకాణం యజమానిని బిల్లు అడిగిండ్రు. వెంటనే టేబుల్‌పై రూ.1,140 బిల్లు వాలింది. భోజారావుకు తాగింది దిగింది. ఇదేందన్నా అంటే.. అంతే అన్నా ఒక్కో బీరుకు రూ.160, మూడు ప్లేట్ల చికెన్‌కు రూ.180.. లెక్కబరాబరే అని యజమాని అనడంతో జేబులు తడుముకోవడం భోజారావు వంతైంది. ఇద్దరి వద్ద ఉన్న పైసలు కాస్త ఒడిసిపోయినయ్.. అరెరె ఏం ధరలురా బై.. దీనమ్మా జీవితంఅంటూ నిట్టూర్పు తీస్తూ బస్సెక్కిండ్రు.
 
 కరీంనగర్‌కు చెందిన రాజు మేడారం వచ్చిండు.. అనుకోకుండా జంపన్నవాగు వద్ద తన చిన్ననాటి స్నేహితుడు చారి కలిసిండు.. ఇద్దరి ఆనందానికి అవధులే లేవు.. అరె చారీ చానా రోజులకు కలిసినవ్‌రా.. అలా వెళ్లి దావత్ చేసుకుందాం పద అంటూ వాగు సమీపంలో ఉన్న ఓ దుకాణంలోకి పోయిండ్రు.. కోటర్ ఏసీ ప్రీమియం మందు ఇయ్యి అన్నా.. అన్నరు.. స్పందించిన దుకాణం యజమాని ఇగో ముందుగాళ్లనే చెబుతున్న.. గిది జాతర.. కోటర్‌కు రూ.170 ధర అయితది అని చెప్పిండు.. దీంతో జేబులు పిసుకుతూ చారీ సారీరా.. కూల్ డ్రింక్‌తో సరిపెట్టుకుందాం అంటూ కూల్‌గా చెప్పిండు.. తమ్స్‌అప్ ఎంత అంటే అది కూడా రూ.15 ధర అని చెప్పగా .. అరె సలిపెడతాంటే కూల్‌డ్రింగ్ ఏందిరాబై.. కనీసం గరం చాయ్ తాగుదాం అని అక్కడి నుండి టీకోట్టు దగ్గరుకు పోయిండ్రు.. టీ ధర కూడా 10. ఉండగా తప్పదుగా అనుకుంటూ తాగి అక్కడి నుండి వెళ్లారు.. ఇదేం ధరలురా గింత రేట్లు ఉంటే జనం పరిప్థితి ఏందిరా అనుకోవడం వారి వంతైంది.
 
 అరెరె.. ఏం ధరలురా బై
 ఇదీ.. మేడారం భక్తుల ధరాఘాతం. మొక్కులు జోరందుకున్న క్రమంలో ధరలూ అదే స్థాయిలో మండిపోతున్నాయి. ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. నీళ్ల బాటిల్ నుంచి బీరు బాటిల్ వరకు డబుల్ రేట్లే. నేటి నుంచి జాతర మొదలు కానుండడం తో ఈ ధరలకు ఇంకా రెక్కలొస్తాయేమోనని భక్తులు బెంబేలెత్తుతున్నారు.  
 - న్యూస్‌లైన్, మేడారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement