సాక్షి, నిజామాబాద్: వైద్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అందరూ భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడంతో పరిస్థితులు మారిపోయాయి. సీమాంధ్రలో నిరసనల నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కిరణ్ జిల్లాకు వస్తారా? లేదా అనే సంశయం ఏర్పడింది. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ లభించడం.. ఇప్పటికే విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు షురుకాగా.. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కళాశాల ప్రారంభ కార్యక్రమం తెరపైకి వచ్చింది. ప్రస్తు త రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా వాసులకు ఉన్నత వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైద్య కళాశాలను మంజూరు చేశారు. నగరంలోని ఖిల్లా రామాలయం వద్ద ఈ కళాశాల నిర్మాణానికి భూమి పూజ కూడా నిర్వహిం చారు. ఆ తర్వాత ప్రభుత్వం కళాశాల స్థలాన్ని ఖలీల్‌వాడీ మైదానానికి మార్పు చేసింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2010 డిసెంబర్‌లో ఖలీల్‌వాడీ మైదానంలో కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం మేలో జిల్లాకు వచ్చింది. రెండు రోజుల పాటు కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఎంసీఐ బృందం పరిశీలనకు వచ్చిన నాటికి కళాశాలలో వసతుల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనుమతి మం జూరుకు ఎంసీఐ నిరాకరించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహం తి అండర్‌టేకింగ్ ఇచ్చారు.
ఎట్టకేలకు ఎంసీఐ ఈ కళాశాలకు అనుమతి మం జూరు చేస్తూ జూన్ 25న ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే అనుమతులు మంజూరు కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు మార్గం సుగమమైంది. ముందుగా 150 సీట్లు ఈ కళాశాలకు కేటాయించారు. తర్వాత రెండువందలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వా రం నుంచి కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సుమా రు 184 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు కళాశాల ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆగస్టు 1 నుంచే ఓరియంటేషన్ తరగతులు కూడా షురువయ్యాయి. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాల ప్రారంభ కార్యక్రమం తెరపైకి వచ్చింది. ముందుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యం లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భవనాల నిర్మాణం పూర్తయ్యాకే..-డాక్టర్ సుమన్‌చంద్ర, వైద్య కళాశాల ప్రిన్సిపాల్
వైద్య కళాశాల ప్రాంగణంలో విద్యార్థి, విద్యార్థుల హాస్టళ్ల భవనాల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. లైబ్రరీ భవన నిర్మాణం పనులు కూడా జరగాల్సి ఉం ది. భవనాల నిర్మాణం పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశాలున్నాయి.
వెద్య కళాశాల ప్రారంభోత్సవంపై మల్లగుల్లాలు
Published Mon, Aug 5 2013 4:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement