హైదరాబాద్: కాంగ్రెస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన తరువాత సీమాంధ్రలో గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. బీజేపీ హయాంలో మూడురాష్ట్రాలు ఏర్పడినప్పుడు సంబరాలు జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రమిస్తే గొడవలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఎన్డిఏ హయాంలో ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అప్పుడు నిరసనలు వ్యక్తంకాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను విడగొడతామనేసరికి సీమాంధ్రలో ఉధ్యమం తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఉద్యమాలు: చిన్మయానంద
Published Sun, Sep 1 2013 6:10 PM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement