తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల చర్చలు ఎటువంటి అంగీకారం లేకుండానే ముగిశాయి.
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల చర్చలు ఎటువంటి అంగీకారం లేకుండానే ముగిశాయి. ఆస్తుల పంపకాలపై జాతీయ స్థాయి అధికారుల సమక్షంలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసంపూర్తిగా ముగిసింది.
విభజన సమయంలో ఉమ్మడిగా ఉన్న 14 ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా అడుగుతోంది. అయితే తెలంగాణ మాత్రం కేవలం బస్ భవన్‌లో మాత్రమే వాటా ఇస్తామని అంటోంది. ఆస్తుల పంపకంపై ఏపీ అధికారులు ఓటింగ్ నిర్వహించాలని కోరినా తెలంగాణ అధికారులు తిరస్కరించారు. దీంతో ఉమ్మడి పాలక మండలి రెండు రాష్ట్రాల అభిప్రాయాలతో కూడిన నివేదికను కేంద్రం నియమించిన నిపుణుల కమిటీకి అందజేయాలని నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకోనుంది.