రైల్వేలో ప్రైవేటీకరణ వద్దు | No privatization of Railways | Sakshi
Sakshi News home page

రైల్వేలో ప్రైవేటీకరణ వద్దు

Published Sat, Sep 20 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

రైల్వేలో ప్రైవేటీకరణ వద్దు

రైల్వేలో ప్రైవేటీకరణ వద్దు

గుంతకల్లు :
 రైల్వేలో కొన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ (ఎస్‌సీఆర్‌ఎంయూ) గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి కె.కళాధర్ డిమాండ్ చేశారు. రైల్వే బోర్డు అవలంబిస్తున్న కార్మిక వ్యతి రేక విధానాలపై డివిజన్ పరిధిలోని ఉద్యోగులు, కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌సీఆర్‌ఎంయూ ఆధ్వర్యంలో శుక్రవారం యూనియన్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాధర్ మాట్లాడుతూ రైల్వేలో సెక్యూరిటీ విభాగం ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలన్నారు. తాత్కాలిక భృతిని వెంటనే మంజూరు చేసి 100 శాతం కరువు భత్యాన్ని 2014 జనవరి 1 నుంచి మూల వేతనంతో కలపాలని డిమాండ్ చేశారు. ఏడవ వేతన సంఘం సిపార్సులనూ అమలు చేయాలన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి రైల్వేలో విదేశీ పెట్టుబడుల అనుమతులను మానుకోవాలని, బోనస్‌పై సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అదనపు భారం, ఒత్తిడి తగ్గించేందుకు తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. రన్నింగ్ విభాగం సహా అన్ని విభాగాల్లోని ఉద్యోగులు, కార్మికులకు 8 గంటల పని విధానం వర్తింపజేయాలన్నారు. ఎస్‌పీఏడీ పేరుతో రన్నింగ్ స్టాఫ్‌ను ఇబ్బందికి గురి చేయడం మంచిది కాదన్నారు. లార్జ్‌జెస్ పథకాన్ని రైల్వేలోని అన్ని కేటగిరిలకు వర్తింపజేసి కార్మికులను ఆదుకోవాల న్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బీజే ప్రకాష్‌బాబు, కేఎండీ గౌస్, ఎస్.విజయ్‌కుమార్, శ్రీనివాసులు, మస్తాన్‌వలి, బాలాజీసింగ్, రాజ మోహన్‌రెడ్డి, సుదర్శన్, జీవన్‌బాబు, జీఎం బాషా, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
 

 

Advertisement

పోల్

Advertisement