
మందులను పరిశీలిస్తున్న శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
పొందూరు : మండల కేంద్రం పొందూరులోని ఆర్‌ఎంపీ వైద్యుడు జాడ రమేష్ క్లినిక్‌పై మంగళవారం ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రూ.1.50 లక్షల విలువైన మందులను గుర్తించారు. నిషేధిత ఔషధాలు వినియోగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం, పాలకొండ, టెక్కటి డివిజన్ల డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కె.కల్యాణి, ఎ.కృష్ణ, ఎ.లావణ్యలు తనిఖీలు నిర్వహించారు.
ఎటువంటి అనుమతులు లేకుండా మందులు అమ్ముతున్నట్లు గురించారు. ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వారి పర్యవేక్షణలో లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే మందుల విక్రయాలు జరగాలని స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా అనుమతులు లేని ప్రదేశంలో మందులను నిల్వ చేయడం, విక్రయించడం నేరమని చెప్పారు.
సుమారు రూ.1.50 లక్షలు మందులు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. మందులు నిల్వ ఉంచడంపై కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment