బైక్‌, ఆటో ఢీ: ఒకరి మృతి | one died in a road accident | Sakshi
Sakshi News home page

బైక్‌, ఆటో ఢీ: ఒకరి మృతి

Published Tue, Oct 13 2015 10:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

one died in a road accident

చిత్తూరు(వి.కోట): రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్ మృతిచెందాడు. చిత్తూరు జిల్లా వి.కోట మండలం నేర్నిపల్లి వద్ద మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో బైక్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలమనేరుకు చెందిన రిఫ్రిజిరేటర్ల మెకానిక్ ఇస్మాయిల్(45) అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement