వనపర్తి టౌన్, న్యూస్‌లైన్: తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేమని వక్తలు పేర్కొన్నారు. కవి ఆకుల శివరాజలింగం రచించిన శివరాజ సంకీర్తనలు, గానామృతం పుస్తకావిష్కరణ, సాహిత్య సంగీత లహరి పాటల సీడీలను ఆదివారం వనపర్తి పట్టణంలోని టీచర్స్‌కాలనీలో అవిష్కరించారు. దీనికి తెలుగు భాషా సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కె.నారాయణరెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ రాఘవరెడ్డి, కవులు, రచయితలు వెల్దండ సత్యనారాయణ, రాంమ్మూర్తి, డీవీవీఎస్ నారాయణ, డాక్టర్ నాయికంటి నరసింహశర్మ, బసవ ప్రభు హాజరై మాట్లాడారు. భాషా పోషణకు పద్య రచనలు అందించే చేయూత మరువలేమన్నారు. పద్యాలను బతికించుకోవడం ద్వారా తెలుగు భాషా సంస్కృతులు రక్షించుకోవచ్చని వివరించారు.
జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో ఎప్పటికీ శాశ్వత పరిపూర్ణత చేకూరదని, ఆలోపే సార్థకత చేసే కార్యాలకు రూపాలిచ్చి ముందుకు సాగాలన్నారు. కళాకారులను, తెలుగు భాషను కాపాడుకునేందుకు కళాభిమానులు, సాహితీప్రియులు ముందకు రావాలన్నారు. పద్యపఠనంతో మనిషిలోని మలినాలు దూరం కావడంతో పాటు ఆత్మసంతృప్తి కలుగుతుందన్నారు. అనంతరం ఆకుల శివరాజలింగంతోపాటు కవులు, రచయితలు, కళాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గాయకులు శ్రీనివాసచార్యులు, వెంకటేశ్వర్‌రెడ్డి, అనిల్‌కుమార్, సత్యంస్వామి, శ్రీనివాసచారి, అశోక్, భక్తవత్సలం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
Published Mon, Sep 9 2013 5:13 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement