రాజకీయ స్వలాభం కోసమే రాష్ట్ర విభజన | Political advantage for the state Division | Sakshi
Sakshi News home page

రాజకీయ స్వలాభం కోసమే రాష్ట్ర విభజన

Published Mon, Sep 2 2013 3:24 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM

Political advantage for the state Division

 సదుం, న్యూస్‌లైన్: తమ రాజకీయ భవిష్యత్తు కోసమే పలు పార్టీలు రాష్ట్ర విభజన కోరుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని నేతాజీ కూడలిలో చేస్తున్న నిరవధిక దీక్షా శిబిరంలో పాల్గొన్న వారికి ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇరు ప్రాంతాల సమన్యాయం కోసం వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తోందన్నారు.

ప్రాణాల కంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా భావించి జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేశారన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన పేరుతో డ్రామాలాడుతున్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే తగు బుద్ధిచెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఉద్యమ జేఏసీ మండల కన్వీనర్ భానుప్రకాష్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, గిరిధర్‌రెడ్డి, బాబూరెడ్డి, లవకుమార్‌రెడ్డి, ఆనంద తదితరులు పాల్గొన్నారు.
 
షర్మిల బస్సు యాత్రను జయప్రదం చేయండి

 రొంపిచెర్ల :  సమైక్యాంధ్ర కోసం వైఎస్ షర్మిల తలపెట్టిన బస్సు యూత్రను విజయువంతం చేయూలని వూజీ వుంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రొంపిచెర్ల పంచాయుతీ కార్యాలయుంలో జరిగిన వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల సవూవేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ ఈ నెల 2,3, తేదీలలో వుహానేత వైఎస్ కువూర్తె రెండు రోజులు జిల్లాలో సమైక్యాంధ్రకు వుద్దతుగా బస్సు యూత్ర చేపడతారని తెలిపారు. 2న తిరుపతిలోను, 3న చిత్తూరు, వుదనపల్లెలో బహిరంగ సభలను ఏర్పాటు చేశావున్నారు.

ఈ సభలకు గ్రావూల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రవుంలో సింగిల్‌విండో చైర్మన్ హరినాథరెడ్డి, వూర్కెట్ కమిటీ చైర్మన్ వుదనమోహన్‌రెడ్డి, చెంచురెడ్డి, సలీంబాషా, చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, ఇబ్రహీంఖాన్, యుర్రంరెడ్డి, కమలాకర్‌రెడ్డి, రావునారాయుణరెడ్డి, రవి, శంకర్‌రెడ్డి, శివశంకర్, అక్బర్‌బాషా,   వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లు సీరాజున్నీసా, రవీంద్ర, జయురావుయ్యు, పెద్దరెడ్డెప్ప, విజయుశేఖర్‌నాయుుడు, లక్ష్మి, వూజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డిశ్వర్‌రెడ్డి, లక్ష్మయ్యు, నూలు రెడ్డెప్ప,  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement