స్పెషల్ సీఎస్ హాజరుకు హైకోర్టు ఆదేశం | Prabhakar D. Thomas should be given clarity, appear before high court | Sakshi
Sakshi News home page

స్పెషల్ సీఎస్ హాజరుకు హైకోర్టు ఆదేశం

Published Sat, Nov 23 2013 3:24 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Prabhakar D. Thomas should be given clarity, appear before high court

సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ డి.థామస్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల వేలిపై వేసే సిరా (ఇంక్) సరఫరాకు సంబంధించి ఓఎస్‌ఎస్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దాఖలు చేసిన కేసులో అధికారులు కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement