సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఈనెల ఆఖరులోపు ఖరారు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను కూడా తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం రఘువీరా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థల రక్షణ, నిత్యవసర వస్తువుల ధరల, యువత, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. రాఫెల్ కుంభకోణం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రచారం చేస్తామన్నారు.
ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభిస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ యాత్రకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి తీరని అన్యాయం చేశారని, ఆయన పర్యటనలో నల్ల జెండాల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. తమ పార్టీ నాయకుల్ని తీసుకునే పార్టీలన్నీ బ్రోకర్ పార్టీలే అని ఆయన వ్యాఖ్యానించారు. తమ వ్యతిరేక పార్టీలన్నీ తమకు సమాన శత్రువులే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment