raguveerareddy
-
జోడో యాత్రలో రాహుల్ ను కలుస్తా : రఘువీరా రెడ్డి
-
ఏపీ పర్యటనకు ప్రియాంక గాంధీ
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఈనెల ఆఖరులోపు ఖరారు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను కూడా తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం రఘువీరా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థల రక్షణ, నిత్యవసర వస్తువుల ధరల, యువత, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. రాఫెల్ కుంభకోణం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రచారం చేస్తామన్నారు. ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభిస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ యాత్రకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి తీరని అన్యాయం చేశారని, ఆయన పర్యటనలో నల్ల జెండాల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. తమ పార్టీ నాయకుల్ని తీసుకునే పార్టీలన్నీ బ్రోకర్ పార్టీలే అని ఆయన వ్యాఖ్యానించారు. తమ వ్యతిరేక పార్టీలన్నీ తమకు సమాన శత్రువులే అని అన్నారు. -
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో 5కె రన్
-
‘ఆ గవర్నర్లు రాజ్యాంగం గొంతు కోశారు’
నెల్లూరు: మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక శాసనసభ స్థానాలు గెలిచినా గవర్నర్లు రాజ్యాంగం గొంతుకోసి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ల తీరుకు నిరసనగా బుధవారం అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతామని ప్రకటించారు. రెండు రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ మణిపూర్, గోవాలో ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ను అందుకోలేనంత దూరంలో నిలిచినా, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి అక్రమ మార్గంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైందని ధ్వజమెత్తారు. గవర్నర్ల చర్యపై ప్రతి ఒక్కరూ నిరసన తెలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రఘువీరా కోరారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిలో మొదటి స్థానం, ఎన్నికల హామీల అమలులో దేశంలో చిట్టచివరి స్థానం సంపాదించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్య నాయుడు అడిగితే, 15 ఏళ్లు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు హోదా ముగిసిన అంశమని బుకాయిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశం కాదనీ, అది రాష్ట్ర ప్రజల హక్కని రఘువీరా చెప్పారు. హోదా సాధన కోసం రెండు కోట్ల మందితో బ్యాలెట్ వేయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామన్నారు.