రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు
రాజాం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. గురువారం రాజాంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల తరఫున పోరాడేందుకు జిల్లాకు వస్తున్న జననేతకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో టీడీపీ జీవిత చరమాంకంలో ఉందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేసే ప్రతి అడుగుకు ఆ పార్టీ ఉలిక్కిపడుతోందని దుయ్యబట్టారు. సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టడం వంటి నీచరాజకీయాలకు దిగుతున్న టీడీపీ సర్కారుకు పతనం తప్పదన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం ప్రారంభమౌతుందని చెప్పారు. రాజాంలోని మున్సిపాల్టీ అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించడం సబబుకాదని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు గవర్నర్‌ను కలవనున్నామని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, యూత్ కన్వీనర్ వంజరాపు విజయ్‌కుమార్, వంగర మండలం కన్వీనర్ కరణం సుదర్శనరావు, అంతకాపల్లి సర్పంచ్ వాకముల్ల చిన్నంనాయుడు, నేత బోర రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
జగన్ పర్యటనతో టీడీపీలో గుబులు
Published Fri, May 19 2017 3:31 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement