కలిసుంటేనే అభివృద్ధి | 'Ramineni' Awards Presentation at the Saraswati Swami paripurnananda | Sakshi
Sakshi News home page

కలిసుంటేనే అభివృద్ధి

Published Mon, Oct 13 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

కలిసుంటేనే అభివృద్ధి

కలిసుంటేనే అభివృద్ధి

‘రామినేని’ అవార్డుల ప్రదాన సభలో పరిపూర్ణానంద సరస్వతి స్వామి
 
విజయవాడ: ప్రాంతీయ విభేదాల కారణంగా తెలుగుజాతి వెనుకపడిపోయిందని, ఈ సమయంలో ఆంధ్ర, రాయలసీమ అని ఆలోచించకూడదని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. కృష్ణానది రాయలసీమలోని శ్రీశైలం మీదుగా వస్తుందని, ఆ నీరే లేకపోతే ఇక్కడ పంటలు ఎండిపోతాయని, అలాగని నీరు నిలుపుకొంటే సీమకూ ఉపయోగం  ఉండదన్నారు. రెండు ప్రాంతాలు కలిస్తేనే పచ్చటి పంటలు పండుతున్నాయన్నారు. అక్కడి మల్లన్న ఇక్కడి దుర్గామల్లేశ్వరుడు ఇద్దరూ ఒక్కరేనన్నారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి పేరిట ఏర్పాటుచేసిన రామినేని ఫౌండేషన్ 15వ పురస్కారోత్సవం జరిగింది.

సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.మోహనరావుకు విశిష్ట పురస్కారం, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయడు, సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావులకు విశేష పురస్కారాలను అందజేశారు. ముఖ్యఅతిథి పరిపూర్ణానంద మాట్లాడుతూ ప్రాంతీయ భావాలను విడనాడి తెలుగువారంతా కలిసి కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలని, దీనిలో రామినేని ఫౌండేషన్ తనదైన మార్కు చూపిం చాలన్నారు. సమావేశానికి  జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించగా, ఎంపీలు గోకరాజు గంగరాజు, కేశినేని శ్రీని వాస్ (నాని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, శ్రీరాం రాజగోపాల్, ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్, ఆయన సోదరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement