Ramineni award
-
భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ దంపతులకు విశిష్ట పురస్కారం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి పురస్కారాలు అందిస్తున్నట్టు డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్ చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎం.ఎల్లకు విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్ ఆస్పత్రి ఎనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్ట్ ఎస్వీ రామారావుకు విశేష పురస్కారాలు అందిస్తున్నట్టు వివరించారు. ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గతేడాది ఫౌండేషన్ తరఫున పురస్కారాలను ప్రకటించినా.. కరోనా కారణంగా వాటిని అందజేయలేదన్నారు. ఈ ఏడాది నిర్వహించే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో వాటినీ అందిస్తామని చెప్పారు. నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతలకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం, టీవీ యాంకర్ సుమకనకాల, హీలింగ్ హాస్థ హెర్బల్స్‌ప్రైవేట్ æలిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.మస్తాన్‌యాదవ్, షిర్డీలోని ద్వారకామయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బి.శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలను గతేడాది ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పురస్కారాలను అందించే తేదీ, వేదిక తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని నాగభూషణం చెప్పారు. -
కలిసుంటేనే అభివృద్ధి
‘రామినేని’ అవార్డుల ప్రదాన సభలో పరిపూర్ణానంద సరస్వతి స్వామి విజయవాడ: ప్రాంతీయ విభేదాల కారణంగా తెలుగుజాతి వెనుకపడిపోయిందని, ఈ సమయంలో ఆంధ్ర, రాయలసీమ అని ఆలోచించకూడదని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. కృష్ణానది రాయలసీమలోని శ్రీశైలం మీదుగా వస్తుందని, ఆ నీరే లేకపోతే ఇక్కడ పంటలు ఎండిపోతాయని, అలాగని నీరు నిలుపుకొంటే సీమకూ ఉపయోగం ఉండదన్నారు. రెండు ప్రాంతాలు కలిస్తేనే పచ్చటి పంటలు పండుతున్నాయన్నారు. అక్కడి మల్లన్న ఇక్కడి దుర్గామల్లేశ్వరుడు ఇద్దరూ ఒక్కరేనన్నారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి పేరిట ఏర్పాటుచేసిన రామినేని ఫౌండేషన్ 15వ పురస్కారోత్సవం జరిగింది. సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.మోహనరావుకు విశిష్ట పురస్కారం, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, రంగస్థల కళాకారుడు ఆచంట వెంకటరత్నం నాయడు, సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావులకు విశేష పురస్కారాలను అందజేశారు. ముఖ్యఅతిథి పరిపూర్ణానంద మాట్లాడుతూ ప్రాంతీయ భావాలను విడనాడి తెలుగువారంతా కలిసి కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలని, దీనిలో రామినేని ఫౌండేషన్ తనదైన మార్కు చూపిం చాలన్నారు. సమావేశానికి జెడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించగా, ఎంపీలు గోకరాజు గంగరాజు, కేశినేని శ్రీని వాస్ (నాని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, శ్రీరాం రాజగోపాల్, ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్, ఆయన సోదరులు పాల్గొన్నారు.