
చిత్తూరు అర్బన్: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో నిందితురాలిగా ఉన్న కోల్‌కతాకు చెందిన మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత ఛటర్జీ బుధవారం చిత్తూరు కోర్టుకు వచ్చారు. ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన సంగీత తన భర్త లక్ష్మణ్‌తో కలసి ఇక్కడికి వచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులకు సంబంధించి న్యాయవాదితో మాట్లాడి ఆమె కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు.
భర్తతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో గతేడాది మే నెలలో కోల్‌కతాలో చిత్తూరు జిల్లా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను చిత్తూరు జైలుకు తరలించారు. కారాగారంలో ఉండగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆమె విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment