sangeeta chatterjee
-
భర్త లక్ష్మణ్‌తో కలసి కోర్టుకు..
చిత్తూరు అర్బన్: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో నిందితురాలిగా ఉన్న కోల్‌కతాకు చెందిన మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత ఛటర్జీ బుధవారం చిత్తూరు కోర్టుకు వచ్చారు. ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన సంగీత తన భర్త లక్ష్మణ్‌తో కలసి ఇక్కడికి వచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులకు సంబంధించి న్యాయవాదితో మాట్లాడి ఆమె కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు. భర్తతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో గతేడాది మే నెలలో కోల్‌కతాలో చిత్తూరు జిల్లా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను చిత్తూరు జైలుకు తరలించారు. కారాగారంలో ఉండగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. -
స్మగ్లర్ సంగీత ఆస్తులు సీజ్
చిత్తూరు (అర్బన్): అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీకి చెందిన రూ. కోటి విలువైన బంగారు, వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. శనివారం చిత్తూరులో విలేకరులతో ఓఎస్డీ రత్న కేసు వివరాలను వెల్లడించారు. చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌ను చిత్తూరు పోలీసులు గతేడాది అరెస్టు చేసి పీడీ యాక్టు ప్రయోగించారు. దీంతో అతని రెండో భార్య సంగీత చెన్నైకి చెందిన గురుస్వామి, ఢిల్లీలోని పలువురు స్మగ్లర్లతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది. ఈ క్రమంలో చిత్తూరు పోలీసులు 2 నెలల క్రితం సంగీతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 9న కోల్‌కతాలోని సంగీత బ్యాంకు లాకర్లను తెరిచి 2.5 కిలోల బంగారు ఆభరణాలు, విదేశాలకు చెందిన 150 నాణేలు, తొమ్మిది సెల్ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్, రూ.60 లక్షల విలువ చేసే ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుని, రూ.90 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. -
‘బుల్లెట్’ను చుట్టేస్తున్న కేసులు!
ఇప్పటికే పలు పోలీసు కేసులతో సతమతం తాజాగా పావని కేసులో శ్రీముఖాలు 9న హాజరుకావాలని నోటీసులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, చిత్తూరు చెందిన అధికారపార్టీ నేత బుల్లెట్ సురేష్ మరో కేసులో చిక్కుకున్నారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్.. ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా చిత్తూరులో పలువురు మహిళల్ని మోసం చేసి 8 కిలోల వరకు బంగారు ఆభరణాలు కాజేసిన పావని ఎపిసోడ్.. బుల్లెట్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కేసు విచారణలో భాగంగా ఈనెల 9న తమ ముందు హాజరు కావాలని వన్‌టౌన్ పోలీసులు సురేష్‌కు నోటీసులు జారీ చేయడం చిత్తూరులో హాట్ టాపిక్‌గా మారింది. చిత్తూరు (అర్బన్): బుల్లెట్ సురేష్‌ను రెండేళ్ల క్రితం ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్న సురేష్ తరువాత బెయిల్‌పై విడుదల అయ్యారు. గత ఏడాది నవంబరులో చిత్తూరు మేయర్‌గా ఉన్న అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల హత్య కేసులో సైతం సురేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం, ఇటీవల బెయిల్‌పై బయటకు రావడం తెలి సిందే. ఈ మధ్యే కోల్‌కత్తాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ భార్య సంగీత చటర్జీను అరెస్టు చేసిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు. తప్పుడు గన్ లెసైన్సును సురేష్‌కు ఇచ్చినట్లు, దీని ద్వారా ఓ తుపాకీను అమ్మినట్లు లక్ష్మన్ పోలీసులకు చెప్పారు. దీనిపై విచారణ సాగిస్తున్న పోలీసులు సురేష్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక తాజాగా చిత్తూరు నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని పలువురు మహిళలను మోసం చేసి దాదాపు 8 కిలోల బంగారు ఆభరణాలను మాయం చేసిన పావని, మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ, హరిదాస్‌లతో కలసి తమ ను బెదిరించినట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పావని, ఆమె భర్త చరన్‌లను అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో 9 రోజుల కస్టడీకు తీసుకున్నారు. పావని దంపతుల్ని విచారిస్తున్న పోలీసులు బుల్లెట్ సురేష్‌పై దృష్టి సారించారు. పోలీసుల విచారణలో పావని సురేష్ పేరు ప్రస్తావించడంమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బుల్లెట్ సురేష్ గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యే క్రమంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసుల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన తమకు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటే అధికారపార్టీ నాయకులు మౌనం వహిస్తున్నారని ఇటీవల సురేష్ కుటుం బ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన తో టీడీపీ నాయకులపై వారు మరింత గుర్రుగా ఉన్నట్లు సమాచారం.