REd sanders smuggling
-
భర్త లక్ష్మణ్‌తో కలసి కోర్టుకు..
చిత్తూరు అర్బన్: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో నిందితురాలిగా ఉన్న కోల్‌కతాకు చెందిన మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత ఛటర్జీ బుధవారం చిత్తూరు కోర్టుకు వచ్చారు. ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన సంగీత తన భర్త లక్ష్మణ్‌తో కలసి ఇక్కడికి వచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులకు సంబంధించి న్యాయవాదితో మాట్లాడి ఆమె కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు. భర్తతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో గతేడాది మే నెలలో కోల్‌కతాలో చిత్తూరు జిల్లా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను చిత్తూరు జైలుకు తరలించారు. కారాగారంలో ఉండగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. -
స్మగ్లర్ సంగీత ఆస్తులు సీజ్
చిత్తూరు (అర్బన్): అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీకి చెందిన రూ. కోటి విలువైన బంగారు, వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. శనివారం చిత్తూరులో విలేకరులతో ఓఎస్డీ రత్న కేసు వివరాలను వెల్లడించారు. చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌ను చిత్తూరు పోలీసులు గతేడాది అరెస్టు చేసి పీడీ యాక్టు ప్రయోగించారు. దీంతో అతని రెండో భార్య సంగీత చెన్నైకి చెందిన గురుస్వామి, ఢిల్లీలోని పలువురు స్మగ్లర్లతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది. ఈ క్రమంలో చిత్తూరు పోలీసులు 2 నెలల క్రితం సంగీతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 9న కోల్‌కతాలోని సంగీత బ్యాంకు లాకర్లను తెరిచి 2.5 కిలోల బంగారు ఆభరణాలు, విదేశాలకు చెందిన 150 నాణేలు, తొమ్మిది సెల్ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్, రూ.60 లక్షల విలువ చేసే ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుని, రూ.90 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. -
బి గ్రేడ్ ఎర్రచందనం టన్ను రూ.50 లక్షలు
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ గిడ్డంగుల్లో ఉన్న ఎర్రచందనం ఈ-వేలంలో బుధవారం కూడా బిడ్డర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. సోమవారం వీటి వేలం మొదలైంది. మంగళవారం వేలం నిర్వహించలేదు. తిరిగి బుధవారం నిర్వహించారు. అయితే తొలిరోజుతో పోల్చితే బుధవారం రేటు గణనీయంగా తగ్గిపోయింది. బి గ్రేడ్ టన్ను సగటు ధర సోమవారం 1.35 కోట్లు కోట్ కాగా బుధవారం రూ.50 లక్షలకు తగ్గింది. బుధవారం మొత్తం 746.882 టన్నులను 30 లాట్లుగా వేలం వేశారు. 27.95 టన్నుల ‘బి’ గ్రేడ్ ఎర్రచందనానికి సగటున టన్నుకు రూ.50 లక్షలు ధర పలికింది. 718.92 టన్నుల సి గ్రేడ్‌కు సగటున టన్ను రూ. 25.88 లక్షలు పలికింది. సి గ్రేడ్ టన్నుకు గరిష్ట ధర రూ. 37.24 లక్షలు, కనిష్ట ధర రూ. 16 లక్షలు కోట్ అయ్యింది. -
30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప(వైఎస్సార్ జిల్లా): జిల్లాలో ఎర్రచందనం అక్రమరవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అటవీ అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నా ఎర్రచందనం దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజాగా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద శుక్రవారం ఉదయం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంను అక్రమరవాణా చేస్తుండగా పోలీసులు నిఘా ఉంచి ఎర్రచందనం దొంగల గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో 30 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, ముగ్గర్ని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కూడా సీజ్ చేశారు. గురువారం బద్వేల్ పరిధి ఒట్టిమడుగు అటవీప్రాంతంలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.