సరస్వతీ పుత్రుడు..! | saraswati putruda | Sakshi
Sakshi News home page

సరస్వతీ పుత్రుడు..!

Published Mon, Mar 3 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

సరస్వతీ  పుత్రుడు..!

సరస్వతీ పుత్రుడు..!

 చదువే తన సర్వస్వం.. సరదాలు సంతోషాలు సైతం చదువులోనే.. సాహిత్యం అంటే మక్కువ.. బోధనారంగంపై ఆసక్తి.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఆకాంక్ష... ఆయనే డాక్టర్ కుప్పిలి హరికిషన్.

ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగం కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిస్తే... హరికిషన్‌ది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం వంగపల్లి పెంట గ్రామం. ఆంగ్లంలో డెరిక్‌వాల్‌కాట్ రచనల్లోని 15 ఆంగ్ల పద్య సంకలనాలపై చేసిన పరిశోధనకు ఇటీవల ఆయనకు ఆంధ్రాయూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఇటీవలే వీసీ రాజు డాక్టరేట్‌ను అందజేశారు.  ఈ పరిశోధనా పత్రాన్ని ఇంగ్లండ్‌కు చెందిన గ్లాస్కో యూనివ ర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ డేవిడ్ జప్పార్ ఉన్నత శ్రేని గ్రంథంగా గుర్తించారు. గ్రంధంగా ముద్రించాలని ఆంధ్రాయూనివ ర్సిటీ అధికారులకు జప్పార్ సూచించారు. హరికిషన్ 2011లో తన పరిశోధనా పత్రాన్ని వ ర్సిటీకి అందజేశారు.
 నిరంతర అభ్యాసకుడు
 ఆయన నిరంతరం చదువుతూనే ఉంటారు. ఏయూలో ఎంఏ ఆంగ్లం, ఉష్మానియా యూనివర్సిటీలో ఎంఏ తత్వశాస్త్రం, హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీలో విదేశీ భాషా శాస్త్రం, ఆంధ్రాయూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ అందుకున్నారు. తమిళనాడులోని భారతీయర్ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్ రచనల కథా సంకనలాపై ఎంఫిల్ పూర్తి చేశారు. ప్రస్తుతం దూరవిద్యలో అన్నమలై యూనివర్సిటీలో ఎంఏ హ్యూమన్ రైట్స్ చదువుతున్నారు. నిరంత రం సమయం వృథాచేయకుండా చదువుతూ ముందుకు సాగుతున్నారు. బోధనలో అంకిత భావం, వస్త్ర ధారణలో సాధారణత్వం ఆయన సొంతం. ఆయనను చూసేవారు అసలు ఇంత విద్యావంతుడా అన్న ఆశ్చర్యపోతారు.
 
 రాజకీయాల్లోకి వస్తా..
 చదువుకున్న యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఈ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పోతుంది. ఈ వ్యవస్థ బాగుపడాలంటే తప్పని సరిగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి. అందుకే రానున్న ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తా... విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా... చదువు సమాజానికి ఉపయోగ పడితేనే సార్థకత ఏర్పడుతుంది. తనుసమాజం నుంచి సహకారం పొంద డం వల్లే ఇంత చదువు చదవగల్గాననంటూ సెలవిచ్చారు.
 -డాక్టర్ హరికిషన్, బీఆర్‌ఏయూ ఆంగ్ల విభాగ కో ఆర్డినేటర్
 
 
 

Advertisement
Advertisement