గర్వించదగ్గ నేత వైఎస్సార్: శేఖర్ గుప్తా | sekhar gupta admires late ysr | Sakshi
Sakshi News home page

గర్వించదగ్గ నేత వైఎస్సార్: శేఖర్ గుప్తా

Published Sun, May 17 2015 12:42 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

గర్వించదగ్గ నేత వైఎస్సార్: శేఖర్ గుప్తా - Sakshi

గర్వించదగ్గ నేత వైఎస్సార్: శేఖర్ గుప్తా

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి తెలుగు నేల గర్వించదగ్గ నేతని ఇండియాటుడే గ్రూప్ వైస్ చైర్మన్  శేఖర్ గుప్తా కొనియాడారు. కాంగ్రెస్ లో కొత్త చరిత్రను సృష్టించిన ఘనతో వైఎస్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్సార్ భిన్నమైన వ్యక్తిగా శేఖర్ గుప్తా అభివర్ణించారు. వృతిపరంగా తనకు వైఎస్సార్ తో మంచి సంబంధాలున్నట్లు శేఖర్ గుప్తా పేర్కొన్నారు.

శనివారం సాక్షి ఎక్సలెన్స్-2014 అవార్డుల  ప్రదానోత్సవం  కార్యక్రమంలో భాగంగా హాజరైన శేఖర్ గుప్తా తెలుగు జాతితో తన అనుబంధం మరిచిపోలేదని గుర్తు చేసుకున్నారు. పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్, వైఎస్ వంటి మహానుభావులను అందించిన ఘనత తెలుగు నేలదన్నారు. తెలుగు సమాజంలోని ప్రముఖులను ‘సాక్షి’ ఎంతో గొప్పగా గౌరవించిందని శేఖర్‌గుప్తా అభినందించారు.

కన్నులపండువగా  సాక్షి ఎక్సలెన్స్-2014 అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement