
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని, దానిని సాధించుకో వడానికి ఎందాకైన పోరాడుతామని ఏపీ విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. అంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ విద్యార్థి సంఘం జేఏసీ, వైఎస్సార్ విద్యార్థి విభాగం, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ విస్మరించారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు.
హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్న నాయకులు ఇప్పుడేమయ్యా రని వారు ప్రశ్నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వాటిని సాధించుకోవడంలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఆర్థిక లోటు భర్తీ, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ లాంటి హామీలను బీజేపీ విస్మరిస్తుంటే పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నిలదీయలేకపోతున్నారన్నారు. ఈ ధర్నాకు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కెవిపీ రామచంద్రారావు, సీపీఐ నేతలు రామకృష్ణ, జగదీష్ మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment