శ్రీకాకుళం టౌన్ : జిల్లా జడ్జి ఆదేశాల మేరకు కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చే స్తున్నట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో పది పాసైన యువత ఖాళీగా ఉండి మద్యానికి అలవాటు పడుతున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి వారికి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో శారీరక, పోటీతత్వ పరీక్షల్లో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు.
ఆర్మీ, ఇతర ఫోర్సుల్లో ఉద్యోగాల్లో మత్స్యకార యువత ప్రవేశాలు పొందేటట్లు చూడాలన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చ ర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో జాతీయ రహదారులపై ప్రమాద స్థలాలను గుర్తించాలని, ఆయా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రక్షక్ వాహనాలను ఉపయోగించి గస్తీని ముమ్మరం చేయాలన్నారు.
రహదారుల ప్రమాదాల నివారణకు స్టేషన్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారులపై అధికంగా వాహనాల్లో ప్రయాణించడం వల్ల జరిగే అనర్ధాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో అన్ని పోలీస్‌స్టేషన్లలో పెద్ద ఎత్తున పేరుకు పోయిన వాహనాలను ఆర్టీవో అధికారులతో సీజ్ చేయబడినవిగా గుర్తించిన వాటిని జూలై నెలాఖరులోగా తొలగించేటట్టు రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారని, మిగిలిన వాహనాలను ఎస్‌ఐలు ఆక్షన్ వేయాల్సిందిగా ఆదేశించారు.
డీఎస్పీలకు రివార్డులు
ప్రజలతో సత్సంబంధాలు పెంచేందు కు కృషి చేసిన శ్రీకాకుళం డీఎస్పీ కె .బార్గవరావునాయుడు, ఇటీవల కటక్‌లో జరిగిన బస్ ప్రమాదంలో క్షతగాత్రులకు సరైన సమయంలో వైద్యసేవలు అందించి, వారిని ఆంధ్రాకు తీసుకురావడంలో విశేష కృషి చేసిన కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్‌కు ఎస్పీ బ్రహ్మారెడ్డి రివార్డులను అందజేసి అభినందించారు. జిల్లా జడ్జి వీబీ నిర్మలాగీతాంబ, ఆర్‌డీవో బలి వాడ దయానిధి, డీటీసీ శ్రీదే వి, ఓఎస్‌డీ తిరుమల రావు, డీఎస్పీలు, సీఐలు , ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కేసుల దర్యాప్తునకు ప్రత్యేక బృందం
Published Sun, Jun 5 2016 8:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement