Investigation cases
-
విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ
-
నెమ్మదించిన కీలక కేసుల దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో ఎంతో సంచలనంగా మారి.. నిత్యం వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఒక్కో కేసులో ఒక్కో అంశం కారణంగా దర్యాప్తు నెమ్మదించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వరుస అరెస్టులతో మొదట్లో హడావుడిగా నడిచింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిïÙట్ సైతం దాఖలుచేశారు. ఇక్కడి వరకు దర్యాప్తు ఫుల్‌స్పీడ్‌లో కొనసాగింది.అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉండటంతో వారిని అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకుంటే తప్ప దర్యాప్తులో ముందుకుసాగని పరిస్థితి. ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. గొర్రెల కేసులో... ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత విచారణకు ఆదేశించిన మరో కీలక కేసు గొర్రెల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే, ఈ కేసు దర్యాప్తు అధికారి మారడంతో మళ్లీ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక అరెస్టులు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో ఈ కేసు ముడిపడి ఉండడం.. ఏసీబీలో సరిపడా సిబ్బంది లేకపోవడం సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు జాప్యానికి కారణం అవుతోంది. రూ.1,000 కోట్ల జీఎస్టీ కేసులో.. అత్యంత సంచలనంగా మారిన మూడో కేసు.. వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల జీఎస్టీ కుంభకోణం. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నిందితుడిగా చేర్చడంతో ఈ కేసుపైనా తీవ్ర చర్చ జరిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి నా.. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు సరిగా లేవని అంటున్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం సాధ్యం కాకపోవడంతో సీఐడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారం కోసం ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖకు లేఖలు రాశారు. ఆ సమాచారం వస్తే తప్ప దర్యాప్తులో ముందడుగు పడని పరిస్థితి. -
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్లో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సింగ్ నగర్‌లోని వివేకానంద పాఠశాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో హత్యాయత్నానికి పాల్పడినట్టు వీడియో ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. డాబా కొట్ల జంక్షన్ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, ఆ ప్రాంతంలోని పలువురి సెల్ ఫోన్లలో వీడియో రికార్డులు, హత్యాయత్నం చేసిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు సమాచారం. దాని ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. రౌడీషి టర్లు, బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు పలువురు అనుమానితులను గుర్తించారు. పోలీసు రికార్డుల ప్రకారం నేర చరితులతోపాటు ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వీడియో ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా దాదాపు 60 మంది వరకు అనుమానితులను మ్యాపింగ్ చేశారు. వారిని పోలీసులు పిలిపించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో మాజీ ప్రజాప్రతినిధి వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించే రౌడీషిటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు, ఇతర అసాంఘిక శక్తులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి వారి కాల్ డేటాను విశ్లేíÙస్తున్నారు. అనుమానితులు ఏయే ప్రాంతాల్లో సంచరించింది.. వారి ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్ చేశారు.. గ్రూప్ కాల్స్ ఏమైనా మాట్లాడారా అనే కోణాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ వివరాల ఆధారంగా అనుమానితులను పలు కోణాల్లో ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలను కాల్ డేటా విశ్లేషణతోపాటు ఆ ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్పిన వివరాలతో సరిపోలుస్తున్నారు. ఆ విధంగా పిలిపించి విచారించిన దాదాపు 60మందిలో ఓ పదిమంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. డాబా కొట్ల సెంటర్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో.. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఈ కేసును ఛేదించాలని భావిస్తున్నారు. వివేకానంద స్కూల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో యాత్ర సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని ఆగంతుకుడికి ముందే తెలుసు. ఆ స్కూల్ ప్రాంగణంలో మాటు వేసి హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉండటం వల్లే డాబాకొట్ల ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాంతంపై ఆగంతకుడికి పూర్తి పట్టు ఉండటంతో ఆ ప్రాంతానికి లేదా ఆ సమీప ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని తన ఇంటికి లేదా తనకు ఆశ్రయం ఇచ్చేవారి ఇంటికి సులువుగా చేరుకుని పోలీసుల కళ్లు కప్పవచ్చనే ధీమా కూడా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, ఇతర అసాంఘిక శక్తులపై పోలీసులు దృష్టి సారించారు. వారిలో రాజకీయ పారీ్టల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు, ప్రత్యర్థి పార్టీ వర్గీయులతో ఘర్షణ పడ్డ చరిత్ర ఉన్నవారు, గంజాయి తదితర వ్యసనాలకు బానిసైనవారు.. ఇలా పలు కోణాల్లో అనుమానితులను గుర్తించి విచారించే ప్రక్రియను వేగవంతం చేశారు. సమాచారమిస్తే రూ.2లక్షల బహుమతి ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆగంతుకుడి సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి అందిస్తామని విజయవాడ పోలీసులు సోమవారం ప్రకటించారు. అగంతకుడికి సంబంధించిన సమాచారం/వీడియో, సెల్‌ఫోన్ ఫుటేజీ అందించినా, హత్యాయత్నాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ముందుకు వచ్చి సమాచారమిచి్చనా ఈ బహుమతి అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచి్చనవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆగంతకుడి సమాచారాన్ని నేరుగా లేదా ఫోన్/వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. సమాచారం అందించేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కంచి శ్రీనివాసరావు, డీసీపీ 9490619342 ఆర్. శ్రీహరిబాబు, ఏడీసీపీ, టాస్క్ ఫోర్స్: 9440627089 -
నేరస్తుల చుట్టూ ముద్రావలయం
సాక్షి, అమరావతి: సమర్థంగా, సమగ్రంగా, త్వరగా కేసుల దర్యాప్తు దిశగా దేశం కీలక ముందడుగు వేయబోతోంది. అందుకోసం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించే వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. కంటిపాప (రెటీనా) నుంచి కాలివేళ్ల దాకా మొత్తం బయోమెట్రిక్ డేటాను సేకరించనుంది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ఐడింటిఫికేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించమని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ని ఆదేశించింది. ఇప్పటివరకు ఖైదీల చేతి వేలిముద్రల సేకరణకే అధికారం నేరస్తులు, అనుమానితుల సమగ్ర డేటాను భద్రపరచడం నేర పరిశోధనకు అత్యంత అవసరం. ఆ కీలక డేటా అందుబాటులో ఉంటే కేసుల దర్యాప్తు, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, సాక్ష్యాధారాల సేకరణ, నేరాన్ని నిరూపించడం సులభసాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరస్తులు కొత్తకొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదం, తీవ్రవాద బెడద పొంచి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో 1920లో రూపొందించిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టాన్ని ఇంకా అనుసరిస్తుండటం సరికాదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖైదీల చేతి వేలిముద్రలను మాత్రమే సేకరించే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కాలానుగుణంగా మారుతున్న నేరాల నిరూపణకు వేలిముద్రలు సరిపోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్–1920 స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం–2022ను పార్లమెంటు ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించింది. ఈ చట్టం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలను కట్టబెట్టింది. ప్రాథమిక విధానం ఖరారు నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు ఎన్సీఆర్బీ విధివిధానాలను రూపొందిస్తోంది. అందుకోసం ఇటీవల అన్ని రాష్ట్రాల నేరగణాంక సంస్థ (ఎస్సీఆర్బీ)లతో సమావేశం నిర్వహించింది. బయోమెట్రిక్ ఆధారాల కింద వేటిని సేకరించాలి, ఎలా భద్రపరచాలి, అమలులో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించి ప్రాథమికంగా ఓ విధానాన్ని ఖరారు చేశారు. న్యాయస్థానాల నుంచి మినహాయింపు ఉన్న కేసుల్లో మినహా అన్ని కేసులకు సంబంధించిన నేరస్తులు, ఖైదీల పూర్తి బయోమెట్రిక్ డేటాను సేకరించాలని నిర్ణయించారు. సీఆర్పీసీ సెక్షన్లలోని చాప్టర్ 9ఏ, చాప్టర్ 10 కింద అరెస్టయి రిమాండులో ఉన్న ఖైదీల బయోమెట్రిక్ డేటాను కనీసం ఎస్పీ ర్యాంకుకు తక్కువకాని పోలీసు అధికారి లిఖితపూర్వక అనుమతితో సేకరిస్తారు. నేరస్తులు, ఖైదీల కంటిపాప, రెండుచేతుల వేలిముద్రలు, రెండు అరచేతులు, రెండు అరిపాదాలు, రెండుకాళ్ల వేలిముద్రలు, ఫొటోలు, సంతకం, చేతిరాత.. ఇలా అన్నీ సేకరిస్తారు. వాటి స్కాన్ కాపీలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. కేవలం నిషేధ ఆజ్ఞల ఉల్లంఘన, ముందస్తు అరెస్టుల కింద అదుపులోకి తీసుకున్నవారి బయోమెట్రిక్ ఆధారాలు సేకరించరు. వాటితోపాటు ఇతర నేరాలు ఏమైనా ఉంటే మాత్రం బయోమెట్రిక్ ఆధారాలు సేకరిస్తారు. ఎవరైనా నేరస్తులు, ఖైదీలు తమ బయోమెట్రిక్ ఆధారాలు ఇచ్చేందుకు సమ్మతించకపోతే అది మరో నేరంగా పరిగణిస్తారు. నేర ఆధారాలను ధ్వంసానికి పాల్పడిన నేరంగా కేసు నమోదు చేసేందుకు పోలీసులకు అధికారం ఉంది. ఆమేరకు న్యాయస్థానం అనుమతితో బలవంతంగా అయినా సరే బయోమెట్రిక్ ఆధారాలు సేకరించే అధికారం పోలీసులకు ఉంది. డిజిటల్ రూపంలో భద్రం నేరస్తులు, ఖైదీల బయోమెట్రిక్ ఆధారాలను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర భద్రతా బలగాలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు సేకరించిన డేటాను డిజిటల్ రూపంలో అందులో భద్రపరుస్తారు. వాటిని అన్ని రాష్ట్రాల ఫోరెన్సిక్ విభాగాలకు అనుసంధానిస్తారు. దీంతో కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు చేపట్టే కేసుల దర్యాప్తు కోసం ఆ డేటా అందుబాటులో ఉంటుంది. ఒక్కో నేరస్తుడు, ఖైదీ నుంచి సేకరించే డేటాను కనీసం 75 ఏళ్లు భద్రపరచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం ఇక అవసరంలేదని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తే న్యాయస్థానం అనుమతితో ఆ డేటాను ధ్వంసం చేస్తారు. అందుకోసం కూడా ఓ విధానాన్ని రూపొందించనున్నారు. త్వరలోనే సమగ్ర బయోమెట్రిక్ డేటా సేకరణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. -
హలో.. నేను పోలీసుని..
సాక్షి, హైదరాబాద్: గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసే నూతన విధానాన్ని సోమవారం నుంచి ప్రారంభించిన నగర పోలీసు విభాగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియపరిచే కొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విధానంలో విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా.. ఏదైనా నేరానికి సంబంధించి కేసు పెట్టడం ఒక ఎత్తయితే.. దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడం మరో ఎత్తుగా మారింది. అనేక కేసులకు సంబంధించి బాధితులు తమ కేసుల్ని విచారిస్తున్న దర్యాప్తు అధికారులను (ఐఓ) కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతుంటారు. అత్యధిక శాతం కేసుల్లో ఎస్ఐ స్థాయి అధికారులే ఐఓలుగా వ్యవహరిస్తుంటారు. హత్య, భారీ చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో ఇన్స్పెక్టర్, వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన వాటిలో ఏసీపీ స్థాయి అధికారులు ఐవోలుగా వ్యవహరిస్తుంటారు. ఎస్ఐలు, ఇతర ఐవోలకు దర్యాప్తు బాధ్యతలతోపాటు పరిపాలన, బందోబస్తు, భద్రతా విధులు, ఇతర డ్యూటీలు తప్పవు. దీంతో చాలా సందర్భాల్లో పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని ఉండటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బాధితులు తమ కాళ్లు అరిగేలా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా ఆయా దర్యాప్తు అధికారుల్ని కలుసుకోవడం చాలాఅరుదు. అతికష్టమ్మీద కలిసినా వారి స్పందన అనేక సందర్భాల్లో అభ్యంతరకరంగా ఉంటోంది. దీంతో పోలీసు విభాగంపై ఇవి ప్రజల్లో చులకన భావానికి కారణమయ్యే ఆస్కారం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఫిర్యాదుదారులకు కేసు దర్యాప్తు ఇవ్వాల్సిన బాధ్యతల్ని ఐఓలకే అప్పగించారు. కేసుగా మారని పిటిషన్ల విషయంలోనూ ఈ పద్ధతినే అవలంభించనున్నారు. ఆన్లైన్లో అన్నీ ఉండవు.. ఈ–కాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక ఆన్లైన్ విధానాలను పోలీసు విభాగం ప్రవేశపెట్టింది. ‘నో యువర్ కేస్ స్టేటస్’కు అవకాశం కల్పించింది. దీని ద్వారా ఎవరైనా తమ కేసు దర్యాప్తు పురోగతి, చార్జ్‌షీట్ దాఖలై కోర్టు విచారణలో ఉందనో, కేసును మూసేశామనో మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే తమ కేసు అప్పటికీ దర్యాప్తు దశలోనే ఉండిపోవడానికో, కేసును మూసేయడానికో కారణం తెలుసుకోవాలంటే మాత్రం ఆన్లైన్ ద్వారా సాధ్యంకాదు. మళ్లీ ఠాణాలు, ఐఓల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల వల్ల కేసు వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండట్లేదు. తొలి రోజు 9 కేసులు.. గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించే పద్ధతి ప్రారంభమైన తొలిరోజు సోమవారం నాడు నగర వ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయి. గస్తీ వాహనాల సిబ్బందిపై నమ్మకం ఉంచిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఠాణా అధికారులకే బాధ్యతలు.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ అంజనీకుమార్ కేసు దర్యాప్తు దశ, తీరుతెన్నుల్ని బాధితులు/ఫిర్యాదుదారులకు వివరించాల్సిన బాధ్యతల్ని దర్యాప్తు అధికారులకే అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి ఐవో తన దగ్గర ఉన్న కేసుల జాబితాతోపాటు ఫిర్యాదుదారుల ఫోన్ నంబర్లు సైతం కలిగి ఉంటారు. ప్రతిరోజూ కొంతమంది చొప్పున ప్రతి బాధితుడికీ కనీసం 15 రోజులకు ఒకసారైనా ఫోన్లు చేసేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. సదరు కేసు ప్రస్తుతం ఏ దశలో ఉంది? దర్యాప్తులో జాప్యానికి కారణమేంటి? ఇతర ఇబ్బందులు, సమస్యలు ఏంటి? అనే అంశాలను సవివరంగా చెప్పాలని సూచించారు. ఇలా ప్రతి పోలీసు తాను ఎవరెవరితో మాట్లాడాననే విషయంతోపాటు వారి నంబర్‌ను ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విధానం అమలయ్యేలా చూడాలని కొత్వాల్ నిర్ణయించారు. పర్యవేక్షణ బాధ్యతల్ని జోనల్ డీసీపీలు, ఏసీపీలకు అప్పగించనున్నారు. అయితే ఫోన్ చేసే బాధ్యతల్ని దర్యాప్తు అధికారికా.. లేక రిసెప్షనిస్టులకు అప్పగించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
కేసుల దర్యాప్తునకు ప్రత్యేక బృందం
శ్రీకాకుళం టౌన్ : జిల్లా జడ్జి ఆదేశాల మేరకు కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చే స్తున్నట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో పది పాసైన యువత ఖాళీగా ఉండి మద్యానికి అలవాటు పడుతున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి వారికి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో శారీరక, పోటీతత్వ పరీక్షల్లో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఆర్మీ, ఇతర ఫోర్సుల్లో ఉద్యోగాల్లో మత్స్యకార యువత ప్రవేశాలు పొందేటట్లు చూడాలన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చ ర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో జాతీయ రహదారులపై ప్రమాద స్థలాలను గుర్తించాలని, ఆయా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రక్షక్ వాహనాలను ఉపయోగించి గస్తీని ముమ్మరం చేయాలన్నారు. రహదారుల ప్రమాదాల నివారణకు స్టేషన్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారులపై అధికంగా వాహనాల్లో ప్రయాణించడం వల్ల జరిగే అనర్ధాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో అన్ని పోలీస్స్టేషన్లలో పెద్ద ఎత్తున పేరుకు పోయిన వాహనాలను ఆర్టీవో అధికారులతో సీజ్ చేయబడినవిగా గుర్తించిన వాటిని జూలై నెలాఖరులోగా తొలగించేటట్టు రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారని, మిగిలిన వాహనాలను ఎస్ఐలు ఆక్షన్ వేయాల్సిందిగా ఆదేశించారు. డీఎస్పీలకు రివార్డులు ప్రజలతో సత్సంబంధాలు పెంచేందు కు కృషి చేసిన శ్రీకాకుళం డీఎస్పీ కె .బార్గవరావునాయుడు, ఇటీవల కటక్‌లో జరిగిన బస్ ప్రమాదంలో క్షతగాత్రులకు సరైన సమయంలో వైద్యసేవలు అందించి, వారిని ఆంధ్రాకు తీసుకురావడంలో విశేష కృషి చేసిన కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్‌కు ఎస్పీ బ్రహ్మారెడ్డి రివార్డులను అందజేసి అభినందించారు. జిల్లా జడ్జి వీబీ నిర్మలాగీతాంబ, ఆర్డీవో బలి వాడ దయానిధి, డీటీసీ శ్రీదే వి, ఓఎస్డీ తిరుమల రావు, డీఎస్పీలు, సీఐలు , ఎస్ఐలు పాల్గొన్నారు.