వారం రోజుల్లో విభజన సమాచారం సిద్ధం | State Bifurcation information will ready within a week | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో విభజన సమాచారం సిద్ధం

Published Tue, Feb 25 2014 6:17 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ప్రసన్న కుమార్ మహంతి - Sakshi

ప్రసన్న కుమార్ మహంతి

హైదరాబాద్: వారం రోజులలో రాష్ట్ర విభజనకు సంబంధించిన సమాచారం సిద్దం చేయాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి  అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్ర విభజన విషయాలపై  సచివాలయంలో మహంతి ఆధ్వర్యంలో  ముఖ్య కార్యదర్శుల కీలక సమావేశం జరిగింది.  సమావేశం జరిగే సమయంలోనే కేంద్ర హొం శాఖ కార్యదర్శి మహంతితో ఫోన్లో మాట్లాడారు.  సచివాలయ విభజన, ప్రాంతల వారీగా ఫైళ్ల విభజన, విభజనకు పట్టే సమయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర  అంశాలపై సమావేశంలో చర్చించారు.

 విభజన అనుకూలంగా సమస్త సమాచారాన్ని వారంరోజుల్లో సిద్ధం చేయాలని మహంతి అధికారులకు చెప్పారు. శాఖల వారీగా అప్పులు, ఆస్తుల వివరాలు అందజేయాలన్నారు. ప్రాంతాల వారీగా  అధికారులను కూడా గుర్తించమని చెప్పారు. అదేవిధంగా ఫైళ్ల విభజనను పూర్తి చేయాలని మహంతి ఆదేశించారు.

 కేంద్ర హోంశాఖ రేపు ఢిల్లీలో సమావేశమై విభజన తేదీని  ఖరారు చేసే అవకాశం ఉంది. మహంతి ఇచ్చే సమాచారం ఆధారంగా ఆ తేదీనికి ఖరారు చేస్తారు.  రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా రేపు ఢిల్లీలో  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement