స్కేటింగ్‌ ద్వారా రాజధాని నిధుల సేకరణ | student funds collecting by skating | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌ ద్వారా రాజధాని నిధుల సేకరణ

Published Tue, Jun 2 2015 10:03 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

student funds collecting by skating

తిరుపతి: :స్కేటింగ్ ద్వారా రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తనవంతు సాయంగా నిధులు సేకరించేందుకు శ్రీకారం చుట్టింది ఓ క్రీడాకారిణి. తిరుపతికి చెందిన ఆకుల సతీష్ కూమార్తె యేషా(8) భారతీయ విద్యాభవన్‌లో 4వ తరగతి చదువుతోంది. ఈమె కొంత కాలంగా స్కేటింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఈనేపథ్యంలో నూతన రాజధాని విజయవాడలోని అమరావతి నిర్మాణానికి తనవంతుగా నిధులు సేకరించేందుకు ముందుకొచ్చింది.

 

అందులో భాగంగానే మంగళవారం ఉదయం తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతీరావ్ పూలే విగ్రహం నుంచి అమరావతికి స్కేటింగ్ ప్రారంభించింది. ఈ స్కేటింగ్‌ను టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో స్కేటింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సేకరణకు శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement