సముద్రంలో మునిగి విద్యార్థి దుర్మరణం | Student killed submerged in the ocean | Sakshi
Sakshi News home page

సముద్రంలో మునిగి విద్యార్థి దుర్మరణం

Published Wed, Jan 21 2015 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

సముద్రంలో మునిగి  విద్యార్థి దుర్మరణం

సముద్రంలో మునిగి విద్యార్థి దుర్మరణం

తోటపల్లి గూడూరు: సరదాగా బీచ్‌లో ఈదడానికి వెళ్లి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్నేహితులతో కలిసి బీచ్‌లో జలకాలాడుతూ బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం కోడూరు బీచ్‌లో చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం మేరకు.. చిత్తూరు నగరం జయనగర్‌కు చెందిన జమాల్ బాషా నిజాంఉద్దీన్ (23) వెంకటాచలం సమీపంలోని క్యూబా ఇంజినీరింగ్ కళశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం కళాశాలకు వచ్చిన నిజాం  మంగళవారం  తన స్నేహితులతో కలిసి  కోడూరుబీచ్‌కు వచ్చాడు.

సాయంత్రం  సమయంలో స్నేహితులందరూ సరదాగా బీచ్‌లో దిగిన సమయంలో ప్రమాదం చోటు చేసుకొంది. బీచ్‌లోపల ఎత్తుపల్లాలు తెలియని నిజాం లోతుకు వెళ్లడంతో అలల జడిలో చిక్కుకున్నాడు. సముద్రంలో చిక్కుకొన్న నిజాంను రక్షించేందుకు స్నేహితులతో పాటు స్థానికులు  ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కోడూరు బీచ్ ప్రధాన గేట్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన నిజాం గంట తర్వాత తీరానికి కొట్టుకొచ్చాడు. పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు.  మృత దేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement