టిడిపి ఎమ్మెల్యే పి. మహేంద్రరెడ్డి
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులపై రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పి. మహేంద్రరెడ్డి బుధవారం చిందులు తొక్కారు. తనకు, తన వాళ్లకు సంబంధించిన పనులు ఎందుకు చేయడం లేదంటూ సదరు ఎమ్మెల్యే సీఎం కార్యాలయ అధికారులపై ఒంటి కాలితో లేచారు.
తన వాళ్లకు సంబంధించిన మెడికల్ కాలేజీ పర్మిషన్ ఫైల్ను కావాలనే తొక్కిపట్టారంటూ ఆరోపించారు. ఆ క్రమంలో సీఎంవో అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే మహేంద్రరెడ్డి వాడిన పదజాలం పట్ల సీఎంవో అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.